తుఫాన్ లా వస్తున్న షారుక్ ఖాన్.. హాలీవుడ్ రేంజ్ లో జవాన్ ట్రైలర్..!!

బాలీవుడ్ యాక్టర్ షారుక్ ఖాన్ పఠాన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న జవాన్ సినిమాలో నటించారు. ఇందులో నయనతార హీరోయిన్గా నటించగా విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తూ ఉండగా దీపికా పదుకొనే, ప్రియమణి కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న జవాన్ సినిమా వచ్చే నెల 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది.

Jawan' Telugu trailer: Shah Rukh Khan starrer promises a blockbuster blend  of action and wit | Telugu Movie News - Times of India

ఇక ఎంతోమంది అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న జవాన్ సినిమా ట్రైలర్ రానే వచ్చేసింది.ఈ సినిమా అన్ని భాషలలో కూడా విడుదల చేయడం జరిగింది.. ట్రైలర్ విషయానికి వస్తే అనగనగా ఒక రాజు ఒక దాని తర్వాత ఒకటి యుద్ధం ఓడిపోతూనే ఉన్నాడు దాహంతో ఆకలితో అతను చాలా కోపంగా ఉన్నాడు అనే డైలాగ్ తో జవాన్ సినిమా ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇందులో షారుఖ్ ఖాన్ డైలాగులతో హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంగా చూపించడం జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్గా జవాన్ అలాగే పలు డిఫరెన్స్ సేటుతో కూడిన క్యారెక్టర్లలో షారుక్ ఖాన్ కనిపించబోతున్నారు.

విజయ్ సేతుపతి కూడా స్టైలిష్ వీలన్ గా కనిపించబోతున్నారు.ఆయన లుక్ గెటప్ పూర్తిగా మారిపోయింది.నయనతార, దీపికా పదుకొనే,ప్రియమణి వంటి గ్లామర్ పరంగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నారు.. చివరిలో జవాన్ల గురించి చెప్పే డైలాగ్ హైలైట్ గా మారుతుంది మొత్తానికి అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో రాయలన్ని కట్ చేశారు డైరెక్టర్ అట్లీ.. ప్రస్తుతం ఈ ట్రైలర్ మాత్రం ట్రెండింగ్ లో ఉన్నది. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.