బిగ్ సీ యానివర్సరీ ఈవెంట్ లో మ‌హేష్ ధ‌రించిన‌ ఆ ష‌ర్ట్ కాస్ట్ ఎంతో తెలిస్తే షాకైపోతారు!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇటీవ‌ల ఖ‌రీదైన దుస్తులు, వ‌స్తువుల‌తో త‌ర‌చూ హెడ్ లైన్ లో నిలుస్తున్నారు. తాజాగా మ‌రోసారి ఇదే జ‌రిగింది. ఆదివారం హైద‌రాబాద్ లో అట్ట‌హాసంగా నిర్వ‌హించిన `బిగ్ సీ` 20వ‌ యానివర్సరీ వేడుక‌ల్లో మ‌హేష్ బాబు పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఈవెంట్ లో చెక్ ష‌ర్ట్‌, జీన్స్ మ‌రియు షూస్ ధ‌రించి సింపుల్ లుక్ లో మ‌హేష్ బాబు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలిచారు.

ఆల్రెడీ ఆయ‌న‌కు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే బిగ్ సీ యానివర్సరీ ఈవెంట్ లో మ‌హేష్ ధ‌రించిన ష‌ర్ట్ కాస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మ‌హేష్ అందాన్ని ఆ ష‌ర్ట్ మ‌రింత పెంచేసింది అన‌డంలో సందేమం లేదు.డీజిల్ బ్రాండ్‌కు చెందిన ష‌ర్ట్ అది. దాని ధ‌ర ఎంతో తెలిస్తే షాకైపోతారు. ఎందుకంటే, చాలా సింపుల్ గా ఉన్నా కూడా ఆ ష‌ర్ట్ ఖ‌రీదు రూ. 18 వేలు.

మ‌హేష్ బాబు రేంజ్ కు అది త‌క్కువ అమౌంటే అయినా.. స‌మాన్యులకు మాత్రం చాలా ఎక్కువ‌. ఒక సామాన్యుడు ఆ ష‌ర్ట్ ను కొనాలంటే నెల జీతంలో స‌గమైనా ఖ‌ర్చు పెట్టాల్సిందే. ఇక ష‌ర్ట్ ధ‌రెంతో తెలుసుకుని నెటిజ‌న్లు ఎప్ప‌టిలాగానే అవునా అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కాగా, ఇటీవ‌లె ఫారెన్ వెకేష‌న్ నుంచి ఇండియాకు వ‌చ్చిన మ‌హేష్ బాబు.. ప్ర‌స్తుతం గుంటూరు కారం మూవీతో బిజీగా ఉన్నాడు. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇందులో యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా అల‌రించ‌బోతున్నారు.