సాధారణంగా ఏ ఆడపిల్లకైనా రెండు ఇంటిపేర్లు ఉంటాయి. ఒకటి పుట్టింటిది రెండోది అత్తింటిది . పుట్టినప్పుడు పుట్టింటి పేరుని ఆమె తన ఇంటిపేరుగా భావిస్తుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక అత్తింటి పేరుని తన పేరుకు ముందు చేర్చుకుంటుంది. అయితే చాలామంది అమ్మాయిలకు పెళ్లి తర్వాతే తమ ఇంటి పేరుని మార్చుకునే అదృష్టం కలుగుతుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా పేరు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి తనకు కాబోయే భర్త వరుణ్ తేజ్ కోసం తన ఇంటిపేరును మూడు ముళ్ళు వేయించుకోక ముందే మార్చుకోవాలని డిసైడ్ అయిందట .
ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ లు ప్రేమించుకున్న విషయం తెలిసిందే . రీసెంట్గా నిశ్చితార్థం చేసుకున్నారు . వీళ్ళ పెళ్లి ముహూర్తానికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్న ఇప్పటికైతే అఫీషియల్ ప్రకటన లేదు . అయితే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కోసం తన పెళ్లికి ముందే ఇంటి పేరుని కొణిదెలగా మార్చుకోబోతుందట .
దీంతో వరుణ్ తేజ్ సో లక్కీ అంటూ పొగిడేస్తున్నారు జనాలు . అంతేకాదు పెళ్లి తర్వాత కూడా తమ ఇంటి పేరుని మార్చుకోవడానికి మొండి చేసే అమ్మాయిలు ఉన్న నేటి కాలంలో ప్రేమించిన అబ్బాయి కోసం పెళ్లికి ముందే ఇంటి పేరుని మార్చుకొవడానికి సిద్ధపడిన లావణ్య త్రిపాఠి గ్రేట్ అంటూ వరుణ్ తేజ్ ను పొగిడేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!