30 ఏళ్లు మెగాస్టార్‌ చిరంజీవికి డూప్‌గా చేసిన వ్య‌క్తి ఎవ‌రంటే..!

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి సత్తాను చాటుకున్నాడు. అయితే ఇటీవ‌ల‌ రిలీజ్ అయినా భోళా శంకర్ చిరంజీవి కెరీర్‌లో పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. టాలీవుడ్ హీరోలు రిస్క్ షాట్స్ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు. అప్పటి ఎన్టీఆర్ నుంచి ఇప్పటి యంగ్ హీరోల వరకు చాలామంది కొన్ని కీలక సన్నివేశాల్లో, మరీ ముఖ్యంగా రిస్క్ సన్నివేశాల్లో డూప్‌లను వాడుతూ ఉంటారు.

ఇక గ్యాప్ టు బాస్ అంటూ 8 ఏళ్ల విరామం త‌ర్వాత‌ మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చాడు. 60 ఏళ్ల వయసులో కూడా దుమ్ము రేపుతూ వరుస సినిమాలతో బిజీగా మారిన మెగాస్టార్ చిరంజీవికి కూడా చాలా సినిమాల్లో డూప్‌ల‌ను వాడారట‌. ఇటీవల సోషల్ మీడియా క్రమంగా డుప్ ల గురించి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఇటీవల ఓ షోలో ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ కి తాను డూప్ గా చేసిన విషయాలని తెలిపాడు. ఈటీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ పేరిట షో ప్రారంభించి ఆయా ప్రాంతాల్లో టాలెంట్ బయటకు తీస్తున్నారు.

ఇదే క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు వెళ్లిన టీం దగ్గరకు చిరంజీవి డూప్ వచ్చాడు. తన పేరు ప్రేమ్ కుమార్ అని తనది మార్తేరు అనీ మూడు దశాబ్దాలుగా చిరంజీవికి డూప్ గా చేస్తున్నట్లు తెలిపాడు. అన్ని సినిమాలకు కాకుండా అవసరమైన వాటికే పిలుస్తారని తెలిపాడు. రికార్డింగ్ డాన్స్ ట్రూప్ కూడా తనకు ఉందని.. అయితే రికార్డింగ్ డాన్స్‌లంటే చిన్న చూపు ఉందని వాపోయాడు. ఇలాంటి షోస్ తో తమలాంటి వారికి గుర్తింపు లభిస్తుందన్నాడు.