భానుప్రియ చెల్లి శాంతిప్రియ‌ను బాడీషేమింగ్ చేసిన స్టార్ హీరో ఎవ‌రంటే..!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ భానుప్రియ ఈ పేరు చాలామందికి తెలుసు. అయితే ఈమె చెల్లెలు శాంతిప్రియ కూడా తెలుగులో హీరోయిన్గా చేసింది. కానీ తమిళ్, హిందీలో వచ్చిన అన్ని అవకాశాలు ఆమెకు తెలుగులో రాలేదు. కొన్నాళ్ళ ముందు ఇంటర్వ్యూలో మాట్లాడిన శాంతి ప్రియ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పై కొన్ని సంచలన కామెంట్స్ చేసింది. తనని గతంలో అతడు బాడీ షేమింగ్‌ చేశాడని వివరించింది. ఇప్పుడు అదే మేటర్ పై మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. అక్షయ్ కుమార్ – శాంతి ప్రియ కలిసి ఇక్కే పే ఇక్కా సినిమాలో నటించారు.

ఓ మిల్ల్‌లో షూటింగ్ టైమ్‌లో గ్లామర్ రోల్ కావడంతో హీరోయిన్ శాంతి ప్రియ కాస్త పొట్టి బట్టలు వేసుకుని అక్కడికి వచ్చిందట‌. దీంతో ఆమె మోకాలు కనిపించిందట‌.. అయితే అది చూసి ఏమైంది మోకాలికి దెబ్బ తగిలిందా అంత నల్లగా ఉన్నాయి ఏంటి అని కామెంట్ చేశాడట అక్ష‌య్‌. దీంతో సెట్స్ లో ఉన్న వాళ్ళందరూ శాంతి ప్రియ ని చూసి నవ్వారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అప్పట్లో నా వయసు 22 – 23 సంవత్సరాలు ఉంటాయి అయితే అక్షయ్ చేసిన ఆ కామెంట్స్ కి నేను డిప్రెషన్ కి గురయ్యానని అమ్మ నాకు అండగా నిలిచింది అంటు చెప్పుకొచ్చింది.

నేను మాత్రమే కాదు అక్క భానుప్రియ కూడా ఇలాంటి బాడీ షేమింగ్ ఎన్నో ఫేస్ చేసిందని నార్త్ లోని కొన్ని మ్యాగజైన్స్ అయితే ముఖంపై మొటిమల సంఖ్యను బట్టి భానుప్రియ తన సినిమాలకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అంటూ రాసుకొచ్చారని చెప్పింది. తన స్కిన్ కలర్ పై అప్పట్లో కామెంట్ చేసిన అక్షయ్ కుమార్ ఇప్పటివరకు ఎటువంటి క్షమాపణ కోరలేదని అయితే ఓ సందర్భంలో మాత్రం జోక్ గా అలా అన్నాను అంటూ చెప్పాడే తప్ప సీరియస్గా సారీ లాంటిదేమీ చెప్పలేదు అంటు వివ‌రించింది. అయితే 1994 లో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శాంతి ప్రియ మళ్ళీ 2014 నుంచి హిందీ బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చి పలు సీరియల్స్ లో నటిస్తుంది.