మహేష్ బాబు ధరించిన ఈ షర్టు ఎంత తెలుసా..?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకరని చెప్పవచ్చు.. మహేష్ వయసు ఐదుపదులు దగ్గర పడుతున్న ఇంకా పాతీ కెళ్ళ కుర్రాడిలా కనిపిస్తూ సౌత్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా బెస్ట్ హ్యాండ్సం లుక్ ఉన్న హీరోగా పేరు సంపాదించారు. మహేష్ బాబు వెండితెరపై ఎలా కనిపిస్తాడో అలాగే ఆఫ్ స్క్రీన్ లో కూడా అంతే గ్లామర్ తో కనిపిస్తూ ఉంటారు. మహేష్ బాబు అంత గ్లామర్ గా కనిపించడం వెనుక చాలా కష్టం దాగి ఉందని చెప్పవచ్చు.

తను మెయింటైన్ చేసే డైటింగ్ ఇండస్ట్రీలో ఏ హీరో కూడా మైంటైన్ చేయలేరని అభిమానులు తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా బాడీని బిల్డ్ చేయకపోయినప్పటికీ మహేష్ బాబు ఫిట్నెస్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మహేష్ బాబు ఫ్యాషన్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్లు వినిపిస్తూనే ఉంటాయి.. అతను ఎప్పుడు బయట కనిపించిన కూడా చాలా సైలెంట్ డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు.

Mahesh Babu's epic reply when asked about frequent foreign trips with  family - Hindustan Times

తాజాగా మహేష్ బాబు నిన్నటి రోజున బిగ్ సి ప్రమోషన్స్ ఈవెంట్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .అయితే ఇందులో మహేష్ బాబు వేసుకున్న డ్రస్సు అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. అయితే అభిమానుల సైతం ఈ డ్రెస్ ద్వారా ఎంతో తెలుసుకోవడానికి నెట్లో సర్చింగ్ చేయగా ఈ షర్టు విలువ దాదాపుగా రూ.18 వేల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో మహేష్ బాబు అంతకంటే ఎక్కువ స్థాయిలో డ్రెస్సింగ్ స్టైల్ ని కూడా ఫాలో అయ్యారు. ప్రస్తుత ఈ విషయం వైరల్ గా మారుతోంది.