రౌడి హీరో విజయ్ దేవరకొండకు కాబోయే భార్యపై సమంత హాట్ కామెంట్స్.. హింట్ వచ్చేసిందిరోయ్..!!

రౌడి హీరో విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటి సంపాదించుకున్న సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఖుషి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ ఎంత ఘనంగా నిర్వహించారో మేకర్స్ మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ షర్ట్ తీసేసి సమంతని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తూ నానా విధాలుగా స్టెప్స్ వేసి రొమాంటిక్ యాంగిల్స్ లో ఫోజులిచ్చాడు .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఖుషి సినిమా పోస్టర్స్ వైరల్ గా మారాయి . కాగా ఇదే ఈవెంట్ లో స్టేజిపై మాట్లాడుతూ సమంత ..విజయ్ కాబోయే భార్య గురించి సంచలన కామెంట్స్ చేసింది . ఆమె మాట్లాడుతూ..” విజయ్ చాలా సింప్లిసిటీ పర్సన్ ..అలాంటి అమ్మాయినే కోరుకుంటాడు .. చాలా సింపుల్ గా ఉండాలి.. ఓవర్ మేకప్ లో ఉండకూడదు.. అంతేకాదు ముఖ్యంగా తన కుటుంబంతో కలిసి పోవాలి ..వారిలో ఒకరిగా మెలగాలి.. అది విజయ్ మరీ మరీ కోరుకుంటాడు . అంతేకాదు విజయ్ దేవరకొండకు ఎక్కువగా ఫోన్ మాట్లాడడం ఇష్టం ఉండదు ..మెసేజ్లే చేస్తాడు.. విజయ్ కు ఫ్రెండ్స్ చాలా చాలా తక్కువ ..ఉన్న ఫ్రెండ్స్ ని చాలా గట్టిగా నమ్ముతాడు . గేమింగ్ యాప్స్ బాగా ఉపయోగిస్తాడు “అంటూ చెప్పుకొచ్చింది.

అయితే విజయ్ దేవరకొండ కూడా..” ఎస్ సమంత చెప్పింది నిజమే . నాకు అలాంటి క్వాలిటీస్ ఉన్న భార్య కావాలి ” అంటూ చెప్పుకు రావడం గమనార్హం. దీంతో విజయ్ దేవరకొండ ని సమంత బాగా అర్థం చేసుకుంది అని ..విజయ్ దేవరకొండ భార్యకు ఉండాల్సిన లక్షణాలన్నీ సమంతకు ఉన్నాయని ..ఇక వేరే అమ్మాయి కాకుండా సమంతనే విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ కూడా జనాలు కామెంట్స్ చేస్తున్నారు . మరి కొందరు మా విజయ్ కి సమంత వద్దు రా బాబోయ్ అంటూ చేతులెత్తి దండం పెట్టేస్తున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ కు కాబోయే భార్య కి ఉండాల్సిన లక్షణాలు ఏంటో చెప్పి క్రేజీ హింట్ ఇచ్చేసింది సమంత .