హైపర్ ఆదితో పెళ్లిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన వ‌ర్షిణి…!

జబర్దస్త్ కంటెస్టెంట్ హైపర్ ఆది, యాంకర్ వర్షిని వీరిద్దరూ ఢీ డాన్సింగ్ షోలో టీం లీడర్స్‌గా సందడి చేశారు. అప్పుడప్పుడు పలు రొమాంటిక్ పర్ఫామెన్స్ లతో స్టేజ్ పై అదరగొట్టిన ఈ జంటపై గత కొద్ది రోజులుగా లవ్ ఎఫైర్ ఉందని న్యూస్‌ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ టాక్. తాజాగా ఈ విషయంపై వర్షిణి స్పందించి…”చాలా రోజుల నుంచి ఆదితో పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నలు ఎదురవుతున్నాయి… కానీ నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. అసలు రియాక్ట్ కావద్దని అనుకున్నాను. కానీ అవ్వక తప్పడం లేదు.

 

ఒకసారి జనాలకు క్లారిటీ ఇవ్వాలి… ఆ రూమర్స్ నిజం కాదు అంతా ఫేక్ న్యూస్… అలాంటి ఆలోచన కూడా నాకు లేదు”. అంటూ వర్షిణి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే… వర్షిణి ఫ్యాన్స్ ఒకరు మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. దానికి స్పందించిన వ‌ర్షిణి మా అమ్మని అడగాలి అని బ‌దిలిచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ భామ పెళ్ళి గురించి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.