తమన్నా నటించిన చిత్రాలలో తనకు నచ్చని సినిమా ఏంటో తెలుసా..?

టాలీవుడ్ హీరోయిన్ తమన్నా హవా ఇండస్ట్రీలో బాగానే కొనసాగుతోంది. తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ తెగ హవా కొనసాగిస్తుంది. తమన్నా బాలీవుడ్ లో పలు రకాల వెబ్ సిరీస్లలో నటిస్తూ బోల్డ్ సన్నివేశాలతో రచ్చ రచ్చ చేస్తోంది. తమన్నా అందాలకు సైతం ప్రేక్షకులు ఫిదా అవుతూ ఉన్నారు ఇప్పుడు తాజాగా మరొక రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.. ఒక చిత్రం చిరంజీవితో కాగా మరొక చిత్రం రజనీకాంత్ తో. ఈ రెండు చిత్రాలు ఆగస్టు నెలలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

 

Sun Pictures in talks with Tamannaah for Vijay's Thalapathy 65 - IBTimes  India

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా తమన్నా పాటలు బోల్డ్ సన్నివేశాలతో మంచి పాపులారిటీ సంపాదించింది. జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీ విడుదల కాగా.. భోళా శంకర్ ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతోంది.. ఇక తమన్నా నటించిన చిత్రాలలో ఒక సినిమాలోని తన పాత్ర అసలు తనకు నచ్చలేదని తెలియజేసింది తన యాక్టింగ్ చూస్తే తనకే చిరాకు అనిపించేలా అనిపించిందని కామెంట్లు చేసి షాక్ ఇచ్చింది..

తమన్నా కెరీర్ ప్రారంభంలో చాలా సినిమాలలో నటించింది తమిళ భాషలలో కూడా నటించిన చిత్రాలలో విజయ్ దళపతి హీరోగా నటించిన ఒక సినిమా ఉందట.ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది ఆ చిత్రంలో తన పాత్ర అసలు నచ్చలేదని తెలిపింది తమన్నా.. సినిమా షూటింగ్ సమయంలోనే ఈ సినిమా పైన ఒక అంచనా ఏర్పడిందట కానీ కమిట్ అయిన కారణంగా ఈ సినిమా పూర్తి చేయాలనే బాధ్యత తన పైన ఉండడంతో ఈ సినిమా చేసినట్లు తెలియజేసింది.