ఏంటీ ..భర్తతో విడిపోతానని నిహారికకు ముందే తెలుసా..?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ప్రేమించడం, బ్రేకప్ చెప్పుకోవడం లేదా పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం అనేది చాలా సర్వసాధారణంగా మారిపోయింది. పెళ్లి అయిన తర్వాత కనీసం 6 నెలలు కూడా గడవకముందే విడాకులు తీసుకొని అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. మరికొంతమంది సంవత్సరాలు తరబడి వైవాహిక జీవితంలో సంతోషంగా గడిపినా కూడా చివరికి మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకుంటూ వేరుపడుతూ ఉండడం నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా 2020 డిసెంబర్లో చాలా ఘనంగా గుంటూరు ఐజి కొడుకు చైతన్య జొన్నలగడ్డ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వివాహం జరిగి కనీసం కొన్ని సంవత్సరాలు కూడా గడవకముందే వీరిద్దరూ విడాకులు తీసుకొని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.నిహారిక కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు.. మీడియా వారు తమకు ప్రైవసీ ఇవ్వాలి అని. ఇలాంటి సున్నితమైన సమయంలో తమను ఇబ్బంది పెట్టకూడదని కూడా సోషల్ మీడియా ద్వారా కోరింది.

ఇదిలా ఉండగా తాజాగా వీరికి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. అసలు విషయంలోకి వెళితే నిహారికకు చైతన్యతో విడిపోతానని ముందుగానే తెలుసట. ఇదేం ట్విస్ట్ అని అనుకుంటున్నారా? ఎందుకంటే వీరికి నిశ్చితార్థం అయిన తర్వాత నుంచి వీరిద్దరి మధ్య ఏ రోజు కూడా బాండింగ్ కరెక్ట్ గా కుదరలేదట. ప్రతి విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు, అభిప్రాయభేదాలు వచ్చేవట. అందుకే ఆమె పిల్లల్ని కూడా కనడానికి ఇష్టపడలేదని.. వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. మొత్తానికైతే ముందే తన భర్త నుంచి విడిపోతానని తెలిసి పిల్లల్ని కూడా కనలేదు నిహారిక అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు..