24 గంటలకాలంలో యూట్యూబ్ ని షేక్ చేసిన సినిమా ట్రైలర్స్ ఇవే!

ఒకప్పుడు సంగతి వేరు గానీ, ఈనాటి పరిస్థితులు వేరు. ఒక సినిమా రిలీజ్ కి ముందు నుండీ హైప్ క్రియేట్ అవ్వాలి. అది ఆ ఆ సినిమా యొక్క టీజర్, ట్రైలర్ లకు నమోదైన లైకులు, వీక్షణలను పై నేడు ఆధారపడుతూ ఉంటుంది. యూట్యూబ్ లో నమోదయ్యే ఈ రికార్డులని సదరు హీరో అభిమానులు కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకోవడం మన ఫ్యాన్ బేస్డ్ సినిమా ఇండియన్ పరిశ్రమలో పరిపాటిగా మారింది. దాని వల్ల ఆ సినిమాకి రికార్డు ఓపెనింగ్స్ అనేవి నమోదవుతాయి కూడా. అవును, ఇదే ఇప్పుడు ఆనవాయితీ. ఓ సినిమా టీజర్ లేదా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో ఎన్ని లైకులు, వ్యూస్ ను నమోదు చేసింది అనేది చాలా కీలకమైన విషయంగా మారిందిప్పుడు.

దానికి చక్కని ఉదాహరణ తాజాగా విడుదలైన ‘సలార్’ టీజర్ అని చెప్పుకోవచ్చు. ఈ ట్రైలర్ యూట్యూబ్ లో సునామీ సృష్టిస్తుంది అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ -ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి పార్ట్ టీజర్.. 24 గంటల్లో 1.67 మిలియన్ లైక్స్ ని కొల్లగొట్టి యావత్ ఇండియన్ సినిమా చరిత్రలోనే నెంబర్ వన్ స్థానంలో వుంది. ఆ తరువాత సినిమాగా ఆర్ ఆర్ ఆర్ గురించి చెప్పుకోవచ్చు. రాజమౌళి – ఎన్టీఆర్ – రాంచరణ్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం టీజర్ ‘రామరాజు ఫర్ భీమ్ ‘ కి 24 గంటల్లో 940.3K లైక్స్ నమోదు కావడం విశేషం. ఇక ఈ సినిమా రికార్డుల గురించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు.

తరువాత ఇక్కడ ‘పుష్ప 2’ సినిమా గురించి మాట్లాడుకోవాలి. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ కి 24 గంటల్లో 793K మిలియన్ లైక్స్ నమోదు కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడిచిన ‘వకీల్ సాబ్’ సినిమా టీజర్ కి 24 గంటల్లో 776.9K మిలియన్ లైక్స్ నమోదు కాబడ్డాయి. అప్పటికి అదే రికార్డ్ అని చెప్పుకోవాలి. అదేవిధంగా మహేష్ బాబు – పరశురామ్ కాంబినేషన్లో రూపొందిన సర్కారు వారిపాట చిత్రం టీజర్ కి 24 గంటల్లో 754.9 K మిలియన్ లైక్స్ నమోదయ్యాయి. ఇక వీటితో పాటు ఇంకా రాబోయే స్టార్ హీరోల సినిమాలు కూడా చాలా రికార్డ్ లు క్రియేట్ చేస్తాయని చెప్పుకోవచ్చు.