సాధారణంగా వైవాహిక జీవితంలో భర్త మనసు భార్య గెలుచుకోవాలంటే.. ముందు అత్తగారిని కాకపట్టాలి. అత్తగారిని తమవైపుకు తిప్పుకోవాలి. ఈ విషయంలో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా మహా ఖిలాడీ అనిపించుకుంది. ఈ అమ్మడు ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కియారా అద్వానీ ఏడడుగులు వేసింది.
షేర్షా’ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. అప్పుడే కియారా-సిద్ధార్థ్ మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయమే ప్రేమగా మారింది. చాలా ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఫైనల్ గా రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. అయితే పెళ్లి రోజే అత్తగారిని బుట్టలో వేసుకునేందుకు కియారా ఏం చేసిందో తెలిస్తే స్టన్ అయిపోతారు. అత్తగారి అభిరుచి తెలిసిన కియారా.. తమ పెళ్లిలో పట్టుబట్టి మరీ పానీపూరీ స్టాల్ ఏర్పాటు చేయించిందట.
దాంతో సిద్ధార్థ్ తల్లి పెళ్లి రోజుకు కియారాకు సగం ఫిదా అయిపోయిందట. ఇక పెండ్లి తర్వాత తొలిసారిగా అత్తగారు తమ ఇంటికి వచ్చినప్పుడు.. స్నాక్స్‌లో పానీపూరీ ఉండేలా జాగ్రత్త పడింది. ఇంకేముంది అత్తమ్మ అభిమానాన్ని కియారా వంద శాతం సంపాదించేసుకుందట. ఈ విషయాన్ని కియారా స్వయంగా రివీల్ చేయడంతో.. నెటిజన్లు ఆమె తెలివితేటలను మెచ్చుకుంటున్నారు. కొత్త కోడళ్లు కియారాను చూసి చాలా నేర్చుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, కియారా ప్రస్తుతం టాలీవుడ్ లో రామ్ చరణ్ తో `గేమ్ ఛేంజర్` అనే మూవీ చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో కూడా పలు ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా గడుపుతోంది.