తమన్నాకు ఆ పాక్ క్రికెటర్ తో వివాహం జరిగిందా? నిజానిజాలేమిటి?

టాలీవుడ్ నటి తమన్నా భాటియా గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ పోయే తమ్ము బేబీ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఆమె నటించిన లస్ట్ స్టోరీస్ 2 తాజాగా నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన విషయం అందరికీ తెలిసినదే. నటుడు విజయ్ వర్మతో ఆమెకు ఉన్న సంబంధం గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ వుంది. ఇదిలా ఉంటే మరో కొత్త కథ కూడా తెరపైకి వస్తోంది. తమన్నా భాటియా పాకిస్థానీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్‌ను వివాహం చేసుకున్నట్లు మరో కొట్టకధ ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్ ఎలా మొదలైంది? ఇందులో నిజమెంత? అనే విషయం తెలియదు గానీ విషయం జోరుగా ప్రచారం అవుతోంది.

అవును, నటి తమన్నాకు అబ్దుల్ రజాక్‌తో పెళ్లయిందని చర్చ జరిగింది. 2017లో తమన్నా, రజాక్ ఇద్దరూ దుబాయ్‌లో నగల దుకాణాన్ని ప్రారంభించేందుకు వెళ్లిన సంగతి విదితమే. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో అప్పటిలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత వీరిద్దరి బంధం గురించిన వార్తలు మీడియాలో వైరల్‌గా ఊపందుకున్నాయి. తమన్నా , రజాక్‌ల నిశ్చితార్థం దుబాయ్‌లో జరిగిందనే పుకార్లు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలను తమన్నా తోసిపుచ్చింది. తమన్నా కొత్త చిత్రం లస్ట్ స్టోరీస్ 2 ఇటీవల విడుదల కావడంతో పాత ఫోటోలు మళ్లీ వైరల్ కావడంతో అసలు అలాంటిదేమీ లేదని గతంలోనే తమన్నా క్లారిటీ ఇచ్చింది.

ఇకపోతే, సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలపై ఇలాంటి పుకార్లు రావడం అనేది సర్వ సాధారణమైన విషయం. తాజాగా తమన్నా మీద మరోసారి మెుదలైంది. ఇది మాత్రమే కాకుండా తమన్నా పెళ్లి చర్చకు సంబంధించిన వార్తలు చాలా సార్లు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో నివసిస్తున్న వైద్యుడిని వివాహం చేసుకుంటున్నట్టు వచ్చినా కూడా. అయితే అవన్నీ వట్టి రూమర్లే. ఇకపోతే బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ వర్మతో తమన్నా ప్రస్తుతం ప్రేమలో ఉంది. వారిద్దరూ కొన్ని చోట్ల కలిసి కనిపించారు. లస్ట్ స్టోరీస్ 2లో రెచ్చిపోయి నటించారు. తాను విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నానని తమన్నా కూడా చెప్పడం గమనార్హం.