ఇండస్ట్రీని ఏలుతున్న తెలుగు అమ్మాయిలు.. ఇప్పుడు వీళ్లదే హవా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిల హవా బాగానే కొనసాగుతోంది.. సరికొత్త సినిమాల కాన్సెప్ట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మలు స్టార్ హీరోల చిత్రాలలో కూడా అవకాశాలు రాబట్టుకోలేకపోయినా చిన్న చిన్న సినిమాలకు పెద్ద ఆప్షన్ గా మారిపోతున్నారు. అంతేకాకుండా కథల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ బ్లాక్బస్టర్ విజయాలను అందుకుంటున్నారు. అలాంటి వారిలో తెలుగమ్మాయిలదే ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు..

గతంలో తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో ఎక్కువగా ఉండేవారు..1990 లో చాలామంది హీరోయిన్స్ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినవారే.. గడిచిన 10 సంవత్సరాల క్రితం నుంచి ఎక్కువగా ముంబై కేరళ చెన్నై వంటి ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్స్ వస్తూ ఉన్నారు.. ఈ ట్రెండ్ చాలా ఎక్కువ అయిపోయింద. హీరోయిన్ అంటే కేరాఫ్ అడ్రస్ గా కేరళ చెన్నై ముంబై వంటి ప్రాంతాలుగా మారిపోయింది. దీంతో స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు పక్క ఇండస్ట్రీలో వైపు చూసే తరుణంలో హీరోయిన్ల కొరత తీయడానికి తెలుగు అమ్మాయిలు రావడం జరిగింది.

 

ఏడాది రెండు బ్లాక్ బాస్టర్ హిట్లలో తెలుగమ్మాయిలు హీరోయిన్స్ గా నటించారు.. గతేడాది మసూధ చిత్రంతో మాయ చేసిన కావ్య కళ్యాణ్రాడాది మరొకసారి బలగం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. శ్రీలీల గురించి చెప్పాల్సిన పనిలేదు దాదాపుగా ఈమె చేతిలో 15 పైగా సినిమాలు ఉన్నాయి. బేబీ చిత్రంతో టాలీవుడ్ ను షేర్ చేస్తున్న మరొక తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య.. యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ నేర్చుకొని ఈ అమ్మాయి బేబీ చిత్రంతో పెను సంచలనాలను అందుకుంది. మరొక హీరోయిన్ ప్రణవి మానుకొండ ఈమె స్లామ్ డాగ్ హస్బెండ్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీస్తోంది. మీరే కాకుండా చాలామంది తెలుగు అమ్మాయిలు కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.