గ‌ప్‌చుప్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సుడిగాలి సుధీర్‌.. ఇంత‌కీ అమ్మాయి ఎవ‌రంటే?

బుల్లితెర‌పై మోస్ట్ ఎలిమిల్ బ్యాచిల‌ర్స్ లిస్ట్ తీస్తే సుడిగాలి సుధీర్ పేరు ముందు వినిపిస్తుంది. ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా బుల్లితెర‌పై క‌మెడియ‌న్ గా భారీ పాపుల‌రిటీని సంపాదించుకున్న సుధీర్‌.. యాంక‌ర్ గా సైతం మంచి పేరు సంపాదించుకున్నాడు. సాఫ్ట్‌వేర్ సుధీర్ మూవీతో హీరోగా మారాడు. `గాలోడు` మూవీతో ఫ‌స్ట్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.

ప్ర‌స్తుతం బుల్లితెర‌పై పెద్ద‌గా క‌నిపించ‌క‌పోయినా.. వెండితెర‌పై బిజీ అయ్యాడు. ఇటీవ‌లె సుధీర్ హీరోగా అత‌ని నాలుగో చిత్రం ప్రారంభం అయింది. లక్కీ మీడియా, మహాతేజా క్రియేషన్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సుడిగాలి సుధీర్, దివ్య భారతి జంట‌గా న‌టిస్తున్నారు. ఈ మూవీకి `G.O.A.T` అనే ఇంట్రెస్టింగ్‌ టైటిల్ ను లాక్ చేశారు.

 

ఇదిలా ఉంటే.. సుధీర్ పెళ్లిపై గత కొంత కాలం నుంచి ఎన్నో వార్త‌లు షికార్లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. యాంక‌ర్ ర‌ష్మీతో సుధీర్ ప్రేమ‌లో ఉన్నాడ‌ని ప‌లు మార్లు ప్ర‌చారం జ‌రిగినా.. తాము కేవ‌లం ఫ్రెండ్స్ అంటూ సుధీర్, ర‌ష్మీ ప్రేమ వార్త‌ల‌ను కొట్టిపారేశారు. ఇక సుధీర్ త‌మ బంధువుల్లో ఒక అమ్మాయితో పెళ్లికి సిద్ధం అయ్యాడంటూ ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. అయితే అవి నిజ‌మే అని అంటున్నారు. తాజాగా ఆ అమ్మాయితో గ‌ప్‌చుప్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడ‌ట‌. ఇరుకుటుంబ‌స‌భ్యులు మాత్ర‌మే ఈ ఎంగేజ్మెంట్ లో పాల్గొన్నార‌ట‌. త్వ‌ర‌లోనే పెళ్లి కూడా జ‌ర‌గ‌నుంద‌ని.. అయితే వివాహం మాత్రం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నార‌ని నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిందే.