బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసిన శ్రీలీల.. ఆ అందం ఏంటి బాబోయ్ అని ఫ్యాన్స్ ఫిదా!

రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘పెళ్లిసందడి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీ లీల. ఆ తర్వాత రవితేజ తో కలిసి ‘ధమాకా’ సినిమా లో నటించ్చింది. ఈ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ చిన్నది. అతి తక్కువ సమయంలోనే బాగా పాపులారిటీ సంపాదించుకొని స్టార్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబు,పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రామ్ పోతినేని లాంటి స్టార్ హీరోల సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. అలానే ధమాకా సినిమాలో శ్రీ లీల తన డాన్స్ తో అందరిని ఒక ఊపు ఊపేసింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ ఫిమేల్ డాన్సర్స్ లో ఒకరు గా పేరు తెచ్చుకుంది ఈ చిన్నది . శ్రీ లీల ఇండస్ట్రీ కి రాకముందు స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా రష్మిక, పూజా హెగ్డేలాంటి హీరోయిన్స్ కనిపించేవారు. అలాంటిది శ్రీలీల వచ్చి వాళ్ళందరిని పక్కకు నెట్టేసింది. ఆమె అందం, అభినయం, నటన, డాన్స్ చూస్తుంటే ఫ్యూచర్ లో శ్రీలీల టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఏలాడం ఖాయం అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గటుగానే శ్రీలీల వరుస అవకాశాలను దక్కించుకొని దుసుకుపోతుంది. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ కొడుకు సంజయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘స్లమ్ డాగ్ హస్బెండ్ ‘  సినిమా జులై 29 న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ పేరుతో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు చిత్ర బృందం.


మూవీ టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముద్దుగుమ్మ శ్రీలీల ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరైన శ్రీ లీల తన అందంతో అందరిని కట్టిపడేసింది. ఈ అమ్మడు తన న్యాచురల్ అందంతో క్యూట్ గా ఇచ్చిన ఫోసులను కెమెరా లో బంధించి సోషల్ మీడియా లో షేర్ చేసారు. ఆమె అందాని చూసిన అభిమానులు ‘ అసలు శ్రీలీల ఎం తింటుంది? మరీ ఇంత అందంగా ఉంటే కుర్రాళ పరిస్థితి ఏంటి? ‘ అంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. శ్రీలీల తన అందమైన పెదవులతో, అమాయకపు చూపులతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కల తెచ్చి పెట్టింది. ప్రస్తుతం శ్రీలీల మహేష్ తో గుంటూరు కారం, రామ్ తో స్కంద, బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా లో నటిస్తుంది.