పవన్ కళ్యాణ్ బ్రో మూవీ రివ్యూ.. హిట్ కొట్టినట్టేనా..?

తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.. పవన్ నటించిన బ్రో సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులో సాయిధరమ్ తేజ్ కూడా నటించారు.. ఈ చిత్రాన్ని నటుడు సముద్రఖని దర్శకత్వం వహించగా హీరోయిన్స్ గా కేతిగా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. మరి ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏవిధంగా అభిమానులను మెప్పించింది తెలుసుకుందాం.

BRO Movie First Day Box Office Prediction

ఇక స్టోరీ విషయానికి వస్తే మార్కండేయ అలియాస్ మార్క్ (సాయి ధరంతేజ్) కేవలం తన ప్రయోజనాల కోసమే తప్ప తన కుటుంబం కోసం కూడా ఎలాంటి పనిచేయని స్వార్థపరుడు.. అలాంటి మార్కండేయ అనుకోకుండా ఒక ప్రమాదంలో కన్నుమూస్తారు.. ఆ సమయంలోనే గాడ్ ఆఫ్ టైం (పవన్ కళ్యాణ్) ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. చనిపోయిన మార్కండేయకు సెకండ్ అవకాశం ఇస్తూ తన జీవితంలోకి గాడ్ ఆఫ్ టైం వచ్చాక ఏం జరిగింది? తన జీవితం ఎలా మలుపు తిరిగింది? అనే కథాంశం తో సముద్రఖని ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.


టాక్ ప్రకారం ఫస్టాఫ్ లో పవన్ కళ్యాణ్ ఎనర్జీ మాస్ చాలా హైలైట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ డైలాగులు స్క్రీన్ ప్రజెంట్స్ అభిమానులను మెప్పించేలా కనిపిస్తున్నాయి.అందరూ అనుకున్నట్టుగానే పొలిటికల్ డైలాగ్ లు కూడా ఇందులో త్రివిక్రమ్ రాయడం జరిగింది.. ముఖ్యంగా తన జనసేన పార్టీ గురించి కూడా డైలాగులు ఉన్నట్లు తెలుస్తోంది.. సాయి ధరంతేజ్ నటన విషయానికి వస్తే తన మామయ్యతో పోటీపడి మరి నటించారని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.

BRO FullHD 1080p HD 720p in Telugu.mp4 - iBOMMA

అయితే కథ రిత్య ఆడియన్స్ ఈ సినిమాకు యావరేజ్ మార్కును అందిస్తున్నారు. కేవలం ఈ సినిమాని పవన్ కళ్యాణ్ పాత్ర పైన ఎక్కువగా డైరెక్టర్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అందుకే స్లోగానే సాగుతున్నట్లు తెలియజేస్తున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా విఎఫ్ ఎక్స్ వరకు కూడా పెద్దగా ఆకట్టుకోలేదట. కొన్ని సన్నివేశాలు వాస్తవికతకు చాలా దూరంగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. సెకండాఫ్ ఎమోషనల్ గా నడిపించిన చివరిలో క్లైమాక్స్ కన్నీరు పెట్టించాలా చేశారు డైరెక్టర్. హీరోయిన్స్ కేతికాశర్మ, ప్రియా వారియర్ తమ పాత్రలలో బాగానే మెప్పించారు. కేవలం డైరెక్టర్ సాయి ధరంతేజ్ పవన్ కళ్యాణ్ మీద ఈ సినిమాను కొనసాగించినట్టు తెలుస్తోంది. మొత్తానికి బ్రో సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక ట్రీట్ వంటిది.. పవన్ అభిమానులకు ఈ సినిమా నచ్చుతుందని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు.