స్టేజీపై అమ్మాయిలా మారి నటరాజ్ మాస్టర్ రొమాన్స్!

నటరాజ్ మాస్టర్ కొత్తగా పరిచయం చేయాలిన అవసరం లేదు. ముందు ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరు తెచుకున్నారు. అయితే బిగ్ బాస్ షోతో ఆయన ఇంకా అందరికి గుర్తుండిపోతారు. హీరోయిన్ బిందు మాధవితో నటరాజ్ మాస్టర్ వాగ్వాదం, గొడవలు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ లో హాట్ టాపిక్ అయ్యేవి అనే చెప్పాలి. అయితే ఇప్పుడు మా వేదికగా ‘నీతోనే డ్యాన్స్’ అనే కొత్త డ్యాన్స్ షో ప్రారంభం అయ్యింది. ఈ షోలో జంటలుగా స్టెప్పులేస్తున్నారు. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ అందరిని షాక్ కి గురిచేసారు. స్టేజీపైనే ఘాటు రొమాన్స్, హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో షాక్ ఇచ్చారు. ఈ షోలో అమర్ దీప్-తేజస్విని, నిఖిల్-కావ్య శ్రీ, శివ కుమార్-ప్రియాంక జైన్, నటరాజ్-నీతూ, సందీప్-జ్యోతి రాజ్, యాదమ్మ రాజు-స్టెల్లా, సాగర్-దీపా జగదీష్, పవన్-అంజలి 8 జోడీలు ఉన్నాయి.

ప్రతి జోడి డాన్స్ లతో అదరగొడుతున్నారు. నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. తాజాగా జరిగిన షోలో నటరాజ్ మాస్టర్-నీతూ తమ డ్యాన్సుతో అందరితో శభాష్ అనిపించుకున్నారు. లేడీ గెటప్పులో నటరాజ్ మాస్టర్ లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ మరో స్థాయికి తీసుకెళ్లాయి. సూపర్ మచ్చి, నా తప్పు ఏమున్నదబ్బా పాటలకు నటరాజ్ మాస్టర్ చేస్తుంటే తరుణ్ మాస్టర్ సీట్ లో ఉండలేకపోయారు అనే చెప్పాలి. ఇక నటరాజ్ మాస్టర్ ఎక్స్ ప్రెషన్స్ చూసి నేర్చుకోని భర్త ముందు ప్రజంట్ చేయాలని రాధ అన్నారు. సదా కూడా వారి పెర్ఫార్మన్స్ కి చాలా పొగిడారు.

పెర్ఫార్మన్స్ అయిపోయాక తరుణ్ మాస్టర్ అయితే ఏకంగా స్టేజీపైకి వచ్చి నటరాజ్ మాస్టర్ ను గట్టిగా హగ్ పట్టేసుకుని హగ్గులు ఇచ్చారు. మాస్టర్ చీర కొంగు లాగి నానా రచ్చ చేశారు. తరుణ్ మాస్టర్ చేష్టలకు నటరాజ్ మాస్టర్ కోపరేట్ చేస్తూ ఘాటుగా రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు. వారిద్దరిని చూసి రాధ, సదా కళ్లు మూసుకుని నవ్వాపుకోలేకపోయారు. “నేను యోగిలా ఉన్నాను. ఇప్పుడు భోగి అయిపోయాను” అని తరుణ్ మాస్టర్ అన్నారు.