కేతిక అందాల అరాచ‌కం.. న‌డిరోడ్డుపై షేపులు చూపిస్తూ టెంప్టింగ్ పోజులు!

కేతిక శ‌ర్మ‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరీ హీరోగా తెర‌కెక్కిన `రొమాంటిక్‌` మూవీతో కేతిక శ‌ర్మ టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత నాగ శౌర్య‌తో `ల‌క్ష్య‌`, వైష్ణ‌వ్ తేజ్ తో `రంగా రంగ వైభవంగా` చిత్రాల్లో న‌టించింది. కానీ, ఈ మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించలేదు.

ప్ర‌స్తుతం కేతిక శ‌ర్మ ఆశ‌ల‌న్నీ `బ్రో` పైనే పెట్టుకుంది. ఈ మెగా మ‌ల్టీస్టార‌ర్ లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోలుగా న‌టించారు. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. ఇందులో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు జోడీగా కేతిక శ‌ర్మ న‌టించింది. ఫాంటసీ కామెడీ చిత్రంగా తెర‌కెక్కిన బ్రో జూలై 28న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ మూవీతో అయినా త‌న ద‌శ మారుతుంద‌ని కేతిక భావిస్తోంది.

సినిమాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. సోష‌ల్ మీడియాలో కేతిక శ‌ర్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. త‌ర‌చూ స్ట‌న్నింగ్ ఫోటో షూట్ల‌తో కుర్ర‌కారు ఫుల్ మిల్స్ పెడుతుంటుంది. తాజాగా మ‌రోసారి త‌న అందాలతో కుర్రాళ్ల మతులు చెడ‌గొడుతూ అరాచ‌కం సృష్టించింది. యూరప్ టూర్ లో ఉన్న కేతిక.. అక్కడ పరాగ్వే నగరంలో న‌డిరోడ్డుపైనే షేపులు చూపిస్తూ సూప‌ర్ టెంప్టింగ్ గా ఫోటోల‌కు పోజులిచ్చింది. ఈ ఫోటోలు కాస్త నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. కేతిక హాట్ స్ట్రక్చర్ పై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ketika (@ketikasharma)