జబర్దస్త్ కమెడియన్లను ఇప్పటికీ బిగ్‌బాస్‌లో ఎందుకు తీసుకుంటున్నారో తెలిస్తే..

బుల్లితెరపై ప్రసారమయ్యే రియాలిటీ షో బిగ్‌బాస్‌ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అయితే ఈ షో ద్వారా పెద్దగా పాపులర్ కానీ వ్యక్తులకు బాగా లాభం ఉంటుంది. కానీ ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్లకి పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. నిజానికి బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తులు బిగ్‌బాస్‌ హౌజ్‌కి వెళ్తే వారిలో ఉన్న మైనస్ లు ప్రేక్షకులు తెలుసుకొని వారిపై ఉన్న ఇష్టాన్ని తగ్గించుకుంటారు. అయితే అన్ని రకాల రంగాల నుంచి సెలబ్రిటీలు బిగ్‌బాస్‌ షోకి వెళ్లి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటారు.

మరీ ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎవరో ఒకరు బిగ్‌బాస్‌ సీజన్స్ లో కనిపిస్తూనే ఉంటారు. మరి ఈసారి బిగ్‌బాస్‌ సీజన్ 7 లోకి జబర్దస్త్ నుండి ఎవరు వెళ్ళబోతున్నారు అంటూ ఆడియన్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. అయితే జబర్దస్త్ నుండి ఒకరు లేదా ఇద్దరు కాంటెస్టెంట్స్ ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట బిబి టీమ్.

జబర్దస్త్ లో ఉన్న కామెడీయన్స్ కి మంచి ప్రైస్ ఆఫర్ చేయడంతో వారు టెంప్ట్ అయిపోయి హౌస్ లోకి వెళ్లడం, ఆ తరువాత వారు నిరాశపరచడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సీజన్‌లో జబర్దస్త్ నుండి బుల్లెట్ భాస్కర్ బిబి హౌస్ లోకి వెళ్ళబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. బిగ్‌బాస్‌ లోకి వెళ్లడం వల్ల కొద్ది రోజులు మాత్రమే ఫేమ్ ఉంటుంది. ఆ తరువాత ఎవరూ వారిని పట్టించుకోరు అని తెలిసి కూడా జబర్దస్త్ కమెడియన్స్ ఎందుకు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.