గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార చెల్లెలు తాన్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలలో గాడ్ ఫాదర్ సినిమా కూడా ఒకటి. ఇందులో నయనతార కూడా కీలకమైన పాత్రలో నటించింది. ఇక నయనతార చెల్లెలి పాత్రలో తాన్య రవిచంద్రన్ నటించింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న తాన్య గాడ్ ఫాదర్ సినిమా తర్వాత ఈ అమ్మడు పెద్దగా కనిపించలేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తూ గ్లామర్ తో కుర్రకారులను ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే తాన్య బ్యాగ్రౌండ్ ఎంటో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు వాటి గురించి తెలుసుకుందాం.

Tanya ravichandran godfather telugu movie 1 satya dev hot hd stills tn –  indiancelebblog.com

1996 ఏప్రిల్ 25న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది తాన్య.. అయితే ఈ అమ్మడు చదువు MA హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ద్వారా పూర్తి చేసింది. తమిళ సీనియర్ నటుడు రవిచంద్రన్ మనవరాలు ఈమె. తాన్య చదువుకునే సమయంలో ఈమెకు సినిమాలలో అవకాశం రావడం జరిగిందట.అలా 2016లో బల్లై వెళ్ళయితీవా అనే సినిమా ద్వారా మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక ఆ తరువాత బృందావనం, కరుపన్, రాజవిక్రమార్క తదితర చిత్రాలలో నటించింది తాన్య.

Tanya S Ravichandran on Twitter: "Thank you for your overwhelming response  and wishes for #Godfather . Working alongside and sharing screen space with  two of the legends in Indian cinema is a

తెలుగులో రాజా విక్రమార్క సినిమాతో మొదటిసారిగా మంచి పాపులారిటీ సంపాదించింది తాన్య. ఆ తర్వాత గాడ్ ఫాదర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించిన ఈ అమ్మడు నయనతార చెల్లెలి పాత్రలో అద్భుతంగా నటించింది. ప్రస్తుతం తమిళంలో పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది ఈ ముద్దుగుమ్మ. అలాగే ఈ ఏడాది పేపర్ రాకెట్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించి తమిళంలో మంచి పాపులారిటీ సంపాదించింది తాన్య రవిచంద్రన్.