ఈ వారంలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసా?…

సినీ ప్రేమికులకు ఈ వారం పండగే అని చెప్పాలి. చాలా సినిమాలు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయబోతున్నాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. టీమ్ ఇండియా క్రికెటర్ ధోనీ నిర్మించిన ‘ఎల్ జి ఎమ్’ సినిమా తెలుగు వెర్షన్ ఆగెస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు రాభోతుంది. రమేష్ తమిళమణి దర్శకత్వం వహించిన ఈ సినిమా లో హరీష్ కళ్యాణ్, ఇవానా జంటగా నటించారు. అయితే తమిళ్ వర్షన్ జులై 28న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.  మరి ఇంకో నాలుగు రోజుల్లో తెలుగులో కూడా రిలీజ్ అయ్యి ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో చూడాలి.

రాజేష్ దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ ‘ సినిమాలో రిష్వి తిమ్మరాజు, విస్వయశ్రీ ప్రధాన పాత్రలో నటించారు. విలేజ్ బ్యాగ్ డ్రాప్ తో తెరకేక్కుతున్న ఈ సినిమా ఈ వారం థియేటర్స్ లో విడుదల కాభోతుంది.

 

 

శివ కోన దర్శకత్వం వహించిన ‘ రాజుగారి కోడిపలావ్ ‘ సినిమాలో ఈటీవీ ప్రభాకర్, నేహా దేశ్ పాండే, శివ కోన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఒక రోడ్డు ట్రిప్ లో కొంతమంది స్నేహితులకు ఎదురైన అనుకోని సంఘటనలతో తెరకేక్కుతున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాభోతుంది.

అభినవ్ మేడిశెట్టి, స్నేహ సింగ్ జంటగా నటించిన ‘దిల్ సే ‘ సినిమా ఆగస్ట్ 4 న రిలీజ్ కాభోతుంది. వీటితో పాటు డబ్బింగ్ సినిమాలయిన అర్జున్ దాస్, బ్లడ్ అంట్ చాకోలెట్, కిచ్చా సుదీప్, హెబ్బూలి సినిమా లు కూడా ఈ వారం ప్రేక్షకులను ఏంటర్టైన్ చెయ్యడానికి రెడీ గా ఉన్నాయి.