దీపిక వార్షిక ఆదాయం ఎంతో తెలిస్తే షాక్..!!

పాన్ ఇండియా లెవెల్లో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ దీపికా పదుకొనే ఈ మధ్యకాలంలో ఇతర భాషలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఎలాంటి సన్నివేశాలలో ఆయన సరే నటిస్తూ తన కెరీర్ ని ముందుకు తీసుకువెళ్తోంది. తన కెరియర్ లో ఒక్క క్షణం తీరిక లేకుండా తమ సమయాన్ని గడిపేస్తున్న దీపికా పడుకొని ఏడాది సంపాదన తెలిసి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది.

Deepika Padukone faces criticism as she skips b'day post for hubby Ranveer | Deccan Herald

అయితే బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం బిజినెస్ వర్గాల దాదాపుగా 40 కోట్ల రూపాయలు సంపాదిస్తుందని తెలుస్తోంది. ఇక సినిమాకు ఏకంగా 15 కోట్ల రూపాయలు.. ఎండోర్స్మెంట్ కు ఏకంగా 10 కోట్ల రూపాయల వరకు దీపికా పదుకొనే తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాలు కూడా వరుసగా క్యూ కడుతున్న నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ భారీగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఏడాది షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్ళీ జవాన్ చిత్రంలో యాక్షన్ మోడ్ లో మరొకసారి మెప్పించబోతోంది.

 

అలాగే టాలీవుడ్ లో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్-K చిత్రంలో కూడా నటిస్తోంది ఈ సినిమాలో ప్రభాస్ కి ఎంత ఇంపార్టెంట్ ఉందో ఈ అమ్మకు కూడా అంతే ఇంపార్టెంట్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీపిక భర్త రణవీర్ కూడా నటుడు కావడంతో ఇద్దరి సంపాదన కొన్ని కోట్ల రూపాయలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీపికా పదుకొనే బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు.