బిగ్‌బాస్ సిరిపై చలాకీ చంటి వైరల్ కామెంట్స్… షాక్‌లో నెటిజన్లు..!

సుమ కనకాల.. ఇది రెండు తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. ఒక వైపు టీవీ షోలు మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటూ ఎటు చూసిన ఆమె కనిపిస్తుంది. కేరళ నుంచి వచ్చిన ఈ మలయాళీ కుట్టి తెలుగు స్పష్టంగా మాట్లాడడమే కాకుండా… బుల్లితెరను తన కేర్ అఫ్ అడ్రస్ గా చేసుకొని తెలుగు ప్రేక్షకులను చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తన మాటలతో చేతలతో ఎంతగానో అలరిస్తోంది.

ఇకపోతే మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారు కొత్తగా నిర్మించిన షో “సుమ అడ్డా”. పేరుకు తగ్గట్టుగానే సుమ ఈ షోకు హోస్ట్. ఇది ఒక టెలివిషన్ స్కెచ్ కామెడీ టాక్ షో. ఈ షో ఈటీవీ, ఈటీవీ విన్ లో ప్రీమియర్ చేయబడుతోంది. ప్రతి వారం ఈ షోకు వస్తున్నా సెలెబ్రిటీలతో ఒక ఆట ఆడుకుంటూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది సుమ. ప్రతి వారం లాగానే ఈ వరం కూడా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేసారు ఈటీవీ వారు. ఈ ఎపిసోడ్ కు చలాకి చంటి, సిరి, హనుమంతు, సన్నీ, ఆర్జే కాజల్ గెస్ట్లుగా వచ్చారు. ఇప్పుడు ఈ ప్రోమో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.

ఎప్పటిలాగానే వివిధ రకాల క్వశ్చన్స్, గేమ్స్ తో హంగామా చేసింది సుమ. నైటీ మన భారతదేశం యూనిఫామ్ అని, గెస్టులకు సమోసాలు పెట్టి అవి కిందటి వారానివి అని పంచ్లు వేసి తెగ సందడి చేసారు. ఈ షో లో భాగంగా ఒక ఫోటో చూపించి ఈ ఫోటో ఆ సినిమాకి సంబంధించినది అని చలాకి చంటిని అడిగారు సుమ. దానికి చంటి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అని సమాధానం ఇవ్వగా… ఇది సినిమా పేరులా లేదు, నీ రియల్ స్టోరీలా ఉంది అని పంచ్ వేశారు సుమ. కాజల్ “నేపాల్ నుంచి నాకోసం ఏం తెచ్చావ్ ?” అని అడిగితే “నువ్వొక్కదానివే కష్టపడుతున్నావు అని పనమ్మాయిని తెచ్చ. ఏ పని కావాలన్నా చేయించుకో.. సాయంత్రం మాత్రం వదిలేస్తూవుండు” అని అన్నాడు చంటి. ఈ డబుల్ మీనింగ్ సమాధానం విన్న సుమ అదిరిపోయే రియాక్షన్ ఇచ్చారు.