పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్..

సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే కాజల్, నయనతార పెళ్లిళ్లు చేసుకొని పిల్లలకి కూడా జన్మనిచ్చారు. తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మరో హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతుందనే వార్త చక్కర్లు కొడుతోంది.

ఆమె ఎవరో కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా నటించిన తేజస్వి మదివాడ. సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టీవ్ గానే ఉంటుంది. కొత్త కొత్త హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సినిమాల్లో, సోషల్ మీడియాలో ఎప్పుడు బిజీ బిజీగా ఉంటుంది. ఇప్పుడు తేజస్వి మదివాడ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

తేజస్వి మదివాడ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఐస్ క్రీం,సుబ్రమణ్యం ఫర్ సేల్, కేరింత, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, కమిట్మెంట్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి మరికొన్ని సినిమాల్లో నటించింది. అయితే తేజస్వికి మాత్రం రియాల్టీ షో ద్వారా మరింత పాపులర్ అయ్యింది. బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఎప్పుడు కొత్త కొత్త ఫోటోలు షేర్ చేస్తూ మరింత పాపులారిటీ పెంచుకుంటుంది. అయితే ఇప్పుడు తన పెళ్లి టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇప్పుడే కాదు గతంలో కూడా పెళ్లి చేసుకోబోతున్నట్టు చాలా రూమర్స్ వచాయి.

అయితే అప్పుడు తేజస్వి స్పందిస్తూ ఇప్పుడే పెళ్లి చేసుకోను అని క్లారిటీ ఇవ్వడంతో పుకార్లకు చెక్ పడింది. అయితే ఇప్పుడు మరోసారి పెళ్లి టాపిక్ వచ్చింది. తేజస్వి తన బెస్ట్ ఫ్రెండ్ నే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు, ఎవ్వరికి చెప్పకుండా ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుందని, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతుందని కొందరు మాట్లాడేసుకుంటున్నారు. అయితే ఇందులో నిజం ఎంత, లేదా ఇవి కూడా రూమర్స్ యేన అనేది తేజస్వి స్పందిస్తే కానీ చెప్పలేం.