ఆ విషయంలో అనసూయను భర్త అంత ఇబ్బందిపెడుతాడా..!!

తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు పొందింది యాంకర్ అనసూయ. ఈమె క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన అనసూయ.. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి బిజీగా ఉన్నందు చేత జబర్దస్త్ కు కూడా దూరమైంది అనసూయ. ఇటీవల కాలంలో పలు చిత్రాలలో పలు క్యారెక్టర్లలో నటిస్తూ బిజీగా ఉంటోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతోపాటు తనపై వస్తున్న ట్రోల్స్ ను కూడా తిప్పికొడుతూ ఉంటుంది.

Anasuya Bharadwaj Biography: Family Wiki, Movielist, Age, Weight, Height,  Education, Husband, & More

అనసూయ ఇద్దరు పిల్లల అమ్మ అయినప్పటికీ కూడా తన అందం ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం హీరోయిన్లకు తీసిపోదని చెప్పవచ్చు. ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో అనసూయ నెగటివ్ రోల్ లో నటిస్తోంది. అలాగే పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. అనసూయ భర్త శశాంక్ భరద్వాజ్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది. అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి వెకేషన్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనసూయ. నిత్యం పలు రకాల ఫోటోషూట్లతో ఎప్పుడు సందడి చేస్తూ ఉంటుంది అనసూయ.

Anchor Anasuya Bharadwaj Husband Profession Revealed - Sakshi

అనసూయ ఫిజిక్ పరంగా బాగానే మెయింటైన్ చేసిన కాస్త బొద్దుగా ఉంటుంది.. అయితే అనసూయ అలా ఉండడానికి కారణం తన భర్త భరద్వాజేనట. తన భర్తకు కొంచెం బొద్దుగా ఉండడమే ఇష్టమట.అందుకే ఆయనకు సెట్ అయ్యే విధంగా అనసూయ అలా ఉంటుందని తెలుస్తోంది.. తన భర్త కూడా తనకు ప్రేమగా వండి పెడుతూ ఫుడ్ ని మరింత సర్వ్ చేసి.. అనసూయ వద్దన్నా కూడా బలవంతంగా ప్లేట్లు వడ్డించి మరి తినిపిస్తాడట.. అలా తన భర్త బలవంతం పెట్టడం వల్ల తిని లావుగా ఉంటుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అనసూయ ఎలా ఉన్నప్పటికీ చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.