బ్యాక్-టు-వర్క్ అంటూ బిజీ అయిపోయిన వరుణ్ తేజ్ ఫియాన్సీ

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి పరిచయం అవసరం లేదు. ఈమధ్య టాలీవుడ్ లో లావణ్య పేరు మారుమ్రోగిపోతుంది. త్వరలోనే వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకొని మెగా ఇంటి కోడలు కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. పదకొండేళ్ల క్రితం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లావణ్య సుమారు ఇరవై సినిమాలో నటించింది. మిస్టరీ సినిమాలో వరుణ్ తేజ్‌తో కలిసి నటించింది. షూటింగ్ సమయంలో వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది.

కుటుంబసభ్యుల అంగీకారంతో జూన్ 9న హైదరాబాద్ లో ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు లావణ్య, వరుణ్. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనుంది. అయితే పెళ్లి తరువాత లావణ్య త్రిపాఠీ సినిమాలో నటిస్తుందా? లేదా? అనే సందేహం అందరిలో మొదలైంది. చాలావరకు లావణ్య తన కేరిర్ కి బ్రేక్ ఇస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అందరి అనుమానాలకు ఫుల్‌స్టాప్ పెట్టేలా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపొయింది లావణ్య.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లో లావణ్య నటిస్తుంది. విశ్వక్ డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. దానికి సంబందించిన షూటింగ్ ని వీడియో తీసి ‘బ్యాక్ టు వర్క్ ‘ అనే ట్యాగ్ తో సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా ఒక కొత్త దర్శకుడితో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీలో కూడా లావణ్య లీడ్ రోల్ చేస్తుంది. అలానే తమిళ్ లో అథర్వకి జంటగా జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇలా లావణ్య త్రిపాఠి వరుస ప్రాజెక్ట్స్ తో చాలా బిజీగా ఉంది.