`బ్రో` మూవీలో ప‌వ‌న్‌-తేజ్ కంటే ముందు అనుకున్న హీరోలు ఎవ‌రో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `బ్రో`. ద‌ర్శ‌క‌న‌టుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. త‌మిళ సూప‌ర్ హిట్ `వినోదయ సీతం`కు రీమేక్ ఇది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ప‌లు మార్పులు చేర్పులు చేసి బ్రో మూవీని రూపొందించారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ దేవుడి పాత్ర‌ను పోషిస్తున్నాడు.

కేతిక శర్మ, ప్రియ ప్రకాష్ వారియర్, సముద్ర ఖని, రోహిణి, తనికెళ్ళ భరణి, అలీ రెజా త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌లు చేశారు. జీ స్టూడియోస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్ పై టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూలై 28న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన బ్రో టీజ‌ర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. టీజ‌ర్ తోనే సినిమాపై భారీ అంచ‌నాలను క్రియేట్ చేశారు.

ఇక ఇదే త‌రుణంలో ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. నిజానికి బ్రో సినిమాలో మొద‌ట అనుకున్న హీరోలు ప‌వ‌న్‌, తేజ్ కాద‌ట‌. మొద‌ట వినోదయ సీతం రీమేక్ రైట్స్ కోసం ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ప్రయత్నించార‌ట‌. ఈ సినిమాని వెంకటేష్ మరియు రానా కాంబో లో తియ్యాలన్న‌ది ఆయన ప్లాన్. స‌ముద్ర‌ఖ‌నిని క‌ల‌వ‌గా.. అందుకు ఆయ‌న ఓకే చెప్పార‌ట‌. ఇంత‌లోనే వినోదయ సీతంను చూసిన త్రివిక్ర‌మ్.. స‌ముద్ర‌ఖనిని క‌లిసి ఈ మూవీని పవన్ కళ్యాణ్, సాయి ధ‌ర‌మ్ తేజ్ ల‌తో తీస్తే బాగుంటుంద‌ని చెప్పాడ‌ట‌. అప్పుడు స‌ముద్ర‌ఖ‌ని ఇలా సురేష్ బాబు గారు కూడా ఈ సినిమా కోసం అడిగార‌ని త్రివిక్ర‌మ్ తో అన్నార‌ట‌. దాంతో త్రివిక్ర‌మ్ సురేష్ బాబుతో సంప్ర‌దింపులు జ‌రిపి ఆయ‌న వెన‌క్కి త‌గ్గేలా చేశార‌ట‌. అలా వెంకీ, రానా చేయాల్సిన వినోద‌య సీతం.. త్రివిక్ర‌మ్ కార‌ణంగా ప‌వ‌న్‌, తేజ్ చేతుల్లోకి వ‌చ్చింద‌ట‌.