అందుకు సిద్ధంగా ఉంటేనే పెళ్లి చేసుకోవాలి.. నాకిప్పుడు మూడ్ లేదు.. త‌మ‌న్నా హాట్ కామెంట్స్‌!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా పేరు గ‌త వారం నుంచి వార్త‌ల్లో మారుమోగిపోతోంది. బాలీవుడ్ లో ఈ అమ్మ‌డు రెండు వెబ్ సిరీస్ లు చేసింది. అందులో ఒక‌టి జీ కర్దా కాగా.. మ‌రొక‌టి లస్ట్ స్టోరీస్ 2. జీ కర్దా ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. లస్ట్ స్టోరీస్ 2 జూన్ 29 నుంచి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ రెండు సిరీస్ ల‌లోనూ త‌మ‌న్నా బోల్డ్ గా యాక్ట్ చేసింది.

బోల్డ్ అంటే అలా ఇలా కాదండోయ్‌.. లిప్ లాక్ సీన్స్‌, ఇంటిమేట్ సిన్స్ ను విచ్చ‌ల‌విడిగా చేసింది. త‌మ‌న్నా బోల్డ్ యాక్టింగ్ చూసి సొంత ఫ్యాన్స్ కూడా షాకైపోతున్నారు. ఇక‌పోతే బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ‌తో రిలేష‌న్ షిప్ లో ఉన్న‌ట్లు రీసెంట్ గా త‌మ‌న్నా బ‌య‌ట పెట్టేసింది. దాంతో ఏ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నా.. విజ‌య్ తో పెళ్లిప్పుడు అంటూ ప్ర‌శ్నించ‌డం మొద‌లు పెట్టాయి. అయితే తాజాగా పెళ్లిపై మిల్కీ బ్యూటీ హాట్ కామెంట్స్ చేసింది.

`వాళ్లు వీళ్లు పెళ్లి చేసుకుంటున్నారు.. మనం కూడా చేసుకోవాలి అని ఎప్పుడు అనుకోకూడదు. పెళ్లంటే ఏదో పార్టీ చేసుకోవ‌డం కాదు. పెళ్లి అనేది ఒక ముఖ్యమైన బాధ్యత. ఆ బాధ్యతకు మనం సిద్ధంగా ఉన్నప్పుడే వివాహ బంధంలోకి అడుగు పెట్టాలి. కెరీర్ ఆరంభంలో 30 ఏళ్లకు చేసుకుని.. పిల్లలను కనాలని అనుకున్నా. కానీ ఆ తర్వాత నా నిర్ణయాన్ని మార్చుకున్నా. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే మూడ్‌ లేదు` అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైల‌ర్ గా మారాయి. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. తెలుగులో భోళా శంక‌ర్‌, త‌మిళంలో జైల‌ర్ చిత్రాలు చేస్తోంది. అలాగే బాల‌య్య `ఎన్‌బీకే 109`లోనూ ఈమె హీరోయిన్ గా ఫిక్స్ అయింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.