`జై రెబ‌ల్ స్టార్` అంటూ బీరు బాటిల్ తో చేయి కోసుకున్న అభిమాని.. పిచ్చి బాగా ముదిరింది రోయ్‌!

సినీ తారలపై అభిమానం ఉండొచ్చు. కానీ అభిమానం హద్దులు దాటితే అనేక అనర్థాలకు దారితీస్తుంది. అభిమానం పేరుతో అతి చేసి ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఎందరో ఉన్నారు. తాజాగా ప్రభాస్‌ అభిమాని అతి ఉత్సాహంతో ప్రాణాలకే తెగించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే. ప్రభాస్ తొలి మైథ‌లాజికల్ మూవీ `ఆదిపురుష్‌` నేడు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

రామాయణం ఆధారంగా రూపొదిద్దుకున్న ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఇక ఆదిపురుష విడుదల సందర్భంగా గురువారం రాత్రి నుంచే థియేటర్ల వద్ద ఫాన్స్ నానా హంగామా చేశారు. ఎక్కడిక‌క్కడ ప్రభాస్ భారీ కటౌట్లు పెట్టి పూలదండలు వేసి కొబ్బరికాయలు కొట్టారు. టపాసులు పేల్చారు. అయితే తాజాగా ఓ అభిమాని ప్రభాస కటౌట్ ముందు `జై రెబ‌ల్ స్టార్` అంటూ బీరు బాటిల్ తో ఏకంగా చేయి కోసేసుకున్నాడు. పదే పదే చేయిని క‌ట్ చేసుకుంటూ.. ఆ రక్తంతో ప్రభాస్ నుదుట తిలకం దిద్దాడు.

అక్కడితో ఆగ‌కుండా డాన్స్ చేస్తూ పలుమార్లు చేయిని క‌ట్ చేసుకున్నాడు. ఇక సదర అభిమానిని చుట్టూ ఉన్నవారు అత‌డిని ఆపకుండా చోద్యం చూస్తూ వీడియోలు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో.. నెటిజ‌న్లు స‌ద‌రు వ్య‌క్తిపై మండిప‌డుతున్నారు. `పిచ్చి బాగా ముదిరిపోయింది రోయ్‌.. వాటిని హాస్పటల్లో చూపించండి రా బాబు` అంటూ కామెంట్లు చేస్తున్నారు. `సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాలి కానీ.. ఇలా చేతులు కాళ్లు కోసుకోవడం ఏంట్రా` అంటూ మ‌రికొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

https://twitter.com/thedevilmonstr/status/1669521249477984256?s=20