దిల్ రాజు కొడుకు బర్త్ డే వేడుకలో సూపర్ స్టార్ మహేష్!

టాలీవుడ్లో ఉన్న స్టార్ నిర్మాతల్లో ‘దిల్’ రాజు ఒకరు. సాధారణంగా సినిమా రంగంలో ప్రొడ్యూసర్ అనేవాడు బాగుపడిన దాఖలాలు చాలా తక్కువ. అతి కొద్దిమంది మాత్రమే ఇక్కడ పాపులర్ అయ్యారు. అందులో దిల్ రాజు మొదటి స్థానంలో ఉంటాడు. ఈయన చేసే ప్రతీ సినిమా తన లెక్కల ప్రకారం బడ్జెట్ వేస్తూ ఎక్కడ లెక్క తప్పకుండ పక్కా ప్లాన్ తో బరిలోకి దిగుతాడు. అన్నింటికి మించి ఈయనకు సినిమాలమీద మంచి అవగాహన ఉంటుంది. అందుకే దిల్ రాజు ఈ సినిమా రంగంలో హిట్ ప్రొడ్యూసర్ గా పేరుగాంచాడు.

దిల్ రాజు గతంలో అన్ని మీడియం బడ్జెట్ సినిమాలు తీసి మంచి లాభాలు ఆర్జించేవాడు. ఈ మధ్య మన టాలీవుడ్ లెక్కలు మారడంతో దిల్ రాజు కూడా రంగంలోకి దిగి హై బడ్జెట్ సినిమాలు నిర్మించడానికి సిద్ధం అయ్యాడు. అయితే కెరీర్ లో దిల్ రాజు సక్సెస్ ఫుల్ గా సాగుతుండగానే.. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉన్నాడు. మొదటి భార్య అనిత మరణించడంతో కొన్నాళ్ల క్రితమే మనోడు 2వ పెళ్లి చేసుకున్న విషయం అందరికీ విదితమే. వీరికి గత ఏడాది జూన్ 29న కొడుకు పుట్టగా అన్వీ రెడ్డి అనే పేరు పెట్టుకున్నాడు. ఇపుడు తన కొడుకు మొదటి పుట్టిన రోజు వేడుకను తాజాగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ వేడుకలు హైదరాబాద్ లోని జెఆర్సీ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. టాలీవుడ్ అతిరధ మహారధుల మధ్య దిల్ రాజు కొడుకు బర్త్ డే వేడుకలో ఘనంగా జరిగాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఇక్కడికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన కూతురు సితార కూడా రావడం జరిగింది. దాంతో ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఆ వేడుకలో దిగిన సూపర్ కూల్ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇద్దరు వైట్ కలర్ డ్రెస్ లో కూల్ గా చిరునవ్వులు చిందిస్తున్న ఈ పిక్ మహేష్ ఫ్యాన్స్ లో వైరల్ అయ్యింది. మరెందుకాలస్యం ఈ పిక్ ఇక్కడే వుంది చూసి తరించండి మరి!