చేతి నిండా సినిమాలున్నా తృప్తి చెంద‌ని శ్రీ‌లీల‌.. డ‌బ్బు కోసం ఎలాంటి ప‌ని చేసిందో తెలుసా?

యంగ్ బ్యూటీ శ్రీ‌లీల ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఎంత బిజీగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. స్టార్ హీరోయిన్ల‌కు రావాల్సిన ఆఫ‌ర్ల‌ను కూడా లాగేసుకుంటున్న శ్రీ‌లీల‌.. మ‌హేష్ బాబుతో గుంటూరు కారం, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌, బాల‌కృష్ణ‌తో భ‌గ‌వంత్ కేస‌రి, వైష్ణ‌వ్ తేజ్ తో ఆది కేశ‌వ చిత్రాలు చేస్తోంది. అలాగే రామ్-బోయ‌పాటి కాంబోలో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా మూవీలోనూ శ్రీ‌లీల‌నే హీరోయిన్‌.

వీటితో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ సినిమా, నితిన్ తో ఓ సినిమా, న‌వీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేసేందుకు క‌మిట్ అయింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న శ్రీ‌లీల‌.. తాజాగా `నీరుస్ క్లాత్ స్టోర్‌` ను ప్ర‌మోట్ చేస్తున్న వీడియోను త‌న సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది. లేడీస్ కు అంద‌మైన ట్రెండీ దుస్తుల‌ను ఈ క్లాత్ స్టోర్ ప్రొవైడ్ చేస్తుంది.

ఇదే విష‌యాన్ని తెలుపుతూ శ్రీ‌లీల ఆ క్లాత్ బ్రాండ్ ను ప్రోట్ చేసింది. దీంతో శ్రీ‌లీల పంచుకున్న వీడియోపై అభిమానులు లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయితే కొంద‌రు మాత్రం చేతి నిండా సినిమాలున్నా శ్రీ‌లీల తృప్తి చెంద‌డం లేదు. అందుకే డ‌బ్బు కోసం చివ‌ర‌కు ఇలాంటి క్లాత్ స్టోర్ ను ప్ర‌మోట్ చేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

https://www.instagram.com/reel/Ct1nMaMJp-7/?utm_source=ig_web_copy_link