టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం స్పై ఈ సినిమాని డైరెక్టర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ డైరెక్టర్ పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. మొదటిసారిగా డైరెక్టర్గా తెలుగుతేరకు పరిచయమవుతున్నారు. గత ఏడాది కార్తికేయ-2 చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించిన నిఖిల్ ఆ తర్వాత తను నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు.
ఈ సినిమా ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి ఫస్ట్ టాక్ బయటకు రావడం జరిగింది. ఈ సినిమా టోటల్గా..U/A సర్టిఫికెట్ను సొంతం చేసుకుంది .ఈ సినిమా నిడివి 2 గంటల 15 నిమిషాలు రన్ టైం తో లాక్ చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమా స్టోరీ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయలేదు. కానీ చరిత్రలో కనుమరుగైన సుభాష్ చంద్రబోస్ గురించి కొన్ని తెలియని విషయాలను తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే సుభాష్ చంద్రబోస్ శత్రువుల చేతిలో పడడం ఆ తర్వాత ఏం జరిగింది కథ అంశంతో ఈ సినిమాని తెరకెక్కించినట్లు సమాచారం. అయితే స్టొరీ పాయింట్ బాగుందనే టాక్ వినిపిస్తోంది. కథ స్టార్ట్ అవ్వడం చాలా ఆసక్తికరంగా స్టార్ట్ అవుతోందని ఆ తర్వాత కథ కొంచెం అయినట్టుగా అనిపించిన ఆ తర్వాత ఫ్రీ ఇంటర్వెల్ నుంచి ఎక్సలెంట్ స్క్రీన్ తో ఈ సినిమా సాగుతోందని తెలియజేశారు. ఎండింగ్ సూపర్ గా ముగుస్తుందని ఓవరాలిగా ఈ సినిమా సీరియస్ స్టోరీ నే అని తెలిపారు. క్వాలిటీ పరంగా ఏ సినిమా ఎక్స్ల్లెంట్ గా ఉండడం విజువల్స్ ఎక్సలెంట్ గా ఉందంటూ తెలియజేస్తున్నారు. మరి నిఖిల్ బాక్సాఫీస్ వద్ద తన జోరు ఎలా చూపిస్తారో చూడాలి మరి.