తన కాబోయే భర్త పై క్లారిటీ ఇచ్చిన శోభితా ధూళిపాళ్ల..!!

టాలీవుడ్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల గత కొద్దిరోజులుగా నాగచైతన్యతో డేటింగ్ చేస్తోందని వార్తలతో మంచి పాపులారిటీ సంపాదించింది. కానీ అవన్నీ ఒట్టి రూమర్లే అంటూ క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. తాజాగా శోభిత నటించిన ది నైట్ మేనేజర్-2 ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నా శోభిత తన పెళ్లి గురించి తనకు కాబోయే భర్త గురించి మాట్లాడడం జరిగింది.వాటి గురించి తెలుసుకుందాం.

Telugu Actress Pics | Telugu Actress Photos | Telugu Actress Gallery |  Telugu Actress Wallpapers

శోభిత మాట్లాడుతూ తనకు కాబోయే వాడికి ఉండవలసిన కొన్ని లక్షణాలను తెలియజేసింది. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఒదిగి ఉండాలి సింప్లిసిటీ మంచి మనసు ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి ప్రకృతిని ఎక్కువగా ప్రేమించాలి ఈ జీవితం చాలా చిన్నదనే విషయాన్ని ముందుగా అతడు అర్థం చేసుకోవాలి తన జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా చాలా ఆస్వాదిస్తూ బాగా ఎంజాయ్ చేయాలని తెలియజేసింది శోభిత ధూళిపాళ్ల.. ఈ విషయాలన్నీ విన్న అభిమానుల సైతం శోభిత తనకు కాబోయే భర్త గురించి ఒక క్లారిటీ ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు..అలాగే తన వ్యక్తిగత జీవితం పైన కూడా కొన్ని వదంతులు రావడంతో వాటిపైన కూడా స్పందించింది.

శోభిత మాట్లాడుతూ ఇలాంటి వార్తలు నన్ను ఏమాత్రం బాధించవు కాకపోతే ప్రేక్షకులు నా వర్క్ లైఫ్ గురించి మాట్లాడితే సంతోషిస్తాను ఎందుకంటే వైజాగ్ నుంచి ఇక్కడి వరకు రావడానికి చాలా కష్టపడ్డాను ఎన్నో ఆడిషన్స్ తర్వాత మొదటిసారి సినిమాలో నటించే అవకాశం వచ్చినది అప్పటినుంచి ఇప్పటివరకు ప్రతిరోజు కష్టపడుతూనే ఉన్నానంటూ తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక నాగచైతన్య తో రిలేషన్షిప్ వార్తల పైన పరోక్షంగా ఇలా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది శోభిత. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.