ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించడమే నేను చేసిన తప్పు.. నటి ప్రియ..!!

హీరో రాఘవ లారెన్స్ తెరకెక్కించిన కాంచన సినిమాలకు ఎలాంటి రికార్డ్స్ ఉన్నాయి చెప్పాల్సిన పనిలేదు.. ఈ చిత్రం అన్ని భాషలలో విడుదలై మంచి విజయాలను అందుకుంది.. ఇక ఇందులో ట్రాన్స్ జెండర్ గా నటి ప్రియ పాత్రను పోషించింది.. ఈమె శరత్ బాబు కు దత్తపుత్రికగా నటించడం జరిగింది. ఇందులో ఈమె నటన మెచ్చుకోదగ్గ నటనని చెప్పవచ్చు. తనను ఇలాంటి మరిన్ని చిత్రాలలో చూడాలని ప్రజలు ఆచరించారు. కానీ అలా ఈమె కెరియర్ సాగలేదట. ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఛానల్ లో పాల్గొన్న ఈమె పలు విషయాలను తెలియజేసింది..

Kanchana Transgender Life | Transgender Priya | Tamil Cinema

ప్రియ మాట్లాడుతూ కాంచన చిత్రంలో నటించడం జీవితంలో నేను చేసిన ఒక పెద్ద తప్పు అని తెలుపుతోంది ప్రియ..సినిమా ఆఫర్ వచ్చేంతవరకు తాను సాధారణ ట్రాన్స్ జెండర్ల తరహాలోని జీవించగలిగాను.. కానీ సినిమా విడుదలయ్యాక తనకు ఉద్యోగం కూడా దొరకడం కష్టమయ్యింది అని తెలుపుతోంది. అప్పటికే తన దగ్గర బోలెడంత డబ్బు ఉందని అందరూ అనుకున్నారు.. కానీ లింగమార్పిడి పాత్రను మాత్రమే పోషించడానికి అనుమతించిన దర్శకనిర్మాతలు ఆ తర్వాత ఈమెకు సినిమాలలో అవకాశాలు ఇచ్చేందుకు నిరాకరించారని తెలుపుతోంది. ఒకవేళ సినిమాల అవకాశము ఉందని వెళితే అలాంటి పాత్రలు వస్తే చెబుతామని తెలియజేసే వారట.

The biggest mistake I made in my life was acting in the movie Kanchana..  Transgender Priya

తన జీవితం ప్రస్తుతానికి బాగానే ఉందని అయితే కాంచన సినిమాలో అలా జరిగిపోయిందని ప్రియ తెలియజేస్తోంది. ఈ చిత్రం కన్నడలో కల్పన గా, తెలుగులో కాంచన, హిందీలో లక్ష్మీగా అలా ఇతర దేశాలలో పలు రకాల పేర్లతో విడుదలై మంచి విజయాలను అందుకుంది. ఈ సినిమా తరువాత మరో సినిమాలో కూడా అవకాశాలు రాలేదని తెలుపుతోంది ప్రియ.