కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ను సంపాదించుకున్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నిఖిల్.. తాజాగా `స్పై` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. ఆర్యన్ రాజేష్, సాన్య ఠాకూర్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడెకర్, మకరంద్ దేష్పాండే కీలక పాత్రలను పోషించారు. రానా దగ్గుబాటి గెస్ట్ రోల్ లో మెరిశారు.
హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 29వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. కానీ, అంచనాలను అందుకోలేకపోయింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ను పట్టుకోవడం, అన్నయ్య మరణం, సుభాష్ చంద్రబోస్ ఫైల్స్ ఇలా అనేక అంశాలను కథలో చేర్చి ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాలని దర్శకుడు అనుకున్నాడు. కానీ, అతడు ప్రేక్షకులను థ్రిల్ చేయలేకపోయాడు.
తొలి ఆట నుంచే ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కానీ, టాక్ తో సంబంధం లేకుండా స్పై తొలి రోజు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లను సొంతం చేసుకుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 4.28 కోట్ల షేర్, రూ. 6.85 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 6.02 కోట్ల షేర్, రూ. 10.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను వసూల్ చేసింది. ఏరియాల వారీగా స్పై ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే..
నైజాం: 1.72 కోట్లు
సీడెడ్: 56 లక్షలు
ఉత్తరాంధ్ర: 54 లక్షలు
తూర్పు: 33 లక్షలు
పశ్చిమ: 22 లక్షలు
గుంటూరు: 48 లక్షలు
కృష్ణ: 25 లక్షలు
నెల్లూరు: 18 లక్షలు
——————————————–
ఏపీ+తెలంగాణ మొత్తం= 4.28 కోట్లు(6.85 కోట్లు~ గ్రాస్)
——————————————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 46 లక్షలు
ఓవర్సీస్: 1.28 కోట్లు
——————————————–
టోటల్ వరల్డ్ వైడ్= 6.02 కోట్లు(10.45 కోట్లు~ గ్రాస్)
——————————————–
కాగా, స్పై మూవీకి వరల్డ్ వైడ్ గా రూ. 17.50 కోట్లు రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రూ. 18.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా రూ. 12.48 కోట్లు రేంజ్ షేర్ ను అందుకోవాల్సి ఉంటుంది. మరి ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న స్పై ఈ టార్గెట్ ను రీచ్ అవుతుందో లేదో చూడాలి.