డ‌బ్బు ఇస్తే దానికి కూడా రెడీ అంటున్న `బ‌ల‌గం` బ్యూటీ.. మ‌రీ బ‌రితెగించేసింది!

కావ్య క‌ళ్యాణ్‌రామ్‌.. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. అల్లు అర్జున్ డ‌బ్యూ మూవీ `గంగోత్రి`తో చైల్ట్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కావ్య‌.. స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, అడ‌వి రాముడు త‌దిత‌ర చిత్రాల్లో మెరిసింది. `మసూద` మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కావ్య‌.. `బ‌ల‌గం` మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బ‌లగం సినిమా ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం కొత్త ప్రాజెక్ట్ ల కోసం వెయిట్ చేస్తున్న కావ్య‌.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె సినిమాల్లో బోల్డ్ సీన్స్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

ఒక నటిగా నిరూపించుకోవాలంటే అన్ని సీన్లలో నటించాలిజ‌ అప్పుడే మనం సంపూర్ణ నటిగా గుర్తింపు పొందుతాం. అయితే లిప్ లాక్ సీన్స్‌, బెడ్ సీన్లు చేయడానికి ఇప్పుడు అందరూ కాస్త ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మంచి కథ వస్తే అలాంటి సీన్లు చేయడానికి నాకు అభ్యంత‌రం లేదు. కాకపోతే కాస్త ఎక్కువ డిమాండ్ చేయాల్సి వస్తుంది` అంటూ చెప్పుకొచ్చింది. డ‌బ్బు ఇస్తే ఎలాంటి సీన్స్ చేయ‌డానికి అయినా తాను రెడీ అని కావ్య క‌ళ్యాణ్‌రామ్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది. దాంతో యంగ్ ఏజ్ లోనే ఈ బ్యూటీ బాగా బ‌రితెగించేసింద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.