గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్ సలోని..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అందాల తారగా పేరుపొందింది హీరోయిన్ సలోని.. తనదైన అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ చూడడానికి తెలుగు అమ్మాయిలాగానే కనిపిస్తూ ఉంటుంది.. ఈమె మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన అమ్మాయి 2003లో దిల్ పరదేశి హుగయా అనే బాలీవుడ్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది.. ఆ తర్వాత ధన-51 సినిమాతో తెలుగుతరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తరుణ్ హీరోగా నటించిన ఒక ఊరిలో సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

saloni aswani | Beauty pictures, Indian film actress, Saree

అటు తర్వాత అడపాదప సినిమాలలో నటించిన సలోనికి ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.. మగధీర చిత్రంలో చిన్న గెస్ట్ రోల్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న సినిమాలో హీరోయిన్గా నటించి తన కెరియర్ లోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ చిత్రంలో హీరోగా సునీల్ నటించారు. దీంతో వరుస ఆఫర్లు వస్తాయనుకున్న ఈ ముద్దుగుమ్మ పరిస్థితి విభిన్నంగా మారిపోయింది. అవకాశాలు తట్టలేదు కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పొలిచిత్రాలలో నటించింది.

2016లో చివరిగా మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమా లో నటించింది. సలోని తండ్రి నార్కోటిక్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నారు ప్రస్తుతం వీరంతా ముంబైలోనే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు నిన్నటి రోజున సలోని బర్తడే ప్రస్తుతం ఈ మెసేజ్ 36 సంవత్సరాలు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసి అభిమానులు సైతం కాస్త షాక్ గురవుతున్నారు. ఈ ఫోటోలు చూస్తూ ఉంటే అసలు ఇక్కడ సలోని నేను అన్నట్టుగా కామెంట్లు చేస్తున్నారు.