ఆఫ‌ర్ల కోసం ప్రణీత బ‌రితెగింపు.. అలాంటి ప‌ని చేసి సొంత ఫ్యాన్స్ చేతే ఛీ కొట్టించుకుంటుంది!

బాపు బొమ్మ ప్రణీత సుభాష్ గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బెంగుళూరులో వైద్యుల కుటుంబంలో జ‌న్మించిన ఈ ముద్దుగుమ్మ‌.. క‌న్న‌డ‌లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది.

`ఏం పిల్లో ఏం పిల్లడో` మూవీతో టాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టింది. బావ, అత్తారింటికి దారేది, ర‌భ‌స వంటి చిత్రాల‌తో ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. అయితే టాలీవుడ్ లో ఈ బ్యూటీకి స్టార్ హోదా మాత్రం ద‌క్క‌లేదు.

దాంతో క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లోనే కెరీర్ కొన‌సాగిస్తున్న ప్ర‌ణీత.. 2021లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో గ‌ప్‌చుప్ గా వివాహం చేసుకుంది.

అయితే అప్ప‌టి వ‌ర‌కు కాస్త ప‌ద్ధ‌తిగానే ఉన్న ప్ర‌ణీత‌.. పెళ్లి త‌ర్వాత ఆఫ‌ర్లు త‌గ్గుతాయ‌ని అనుకుందో ఏమో అందాల ఆర‌బోత‌కు తెర లేపింది. బిడ్డ పుట్టిన త‌ర్వాత మ‌రిగింత బ‌రితెరిగించేసింది. త‌ర‌చూ స్కిన్ షోతో సోష‌ల్ మీడియాలో దుమారం రేపుతోంది.

పెళ్లై, ఒక బిడ్డ‌కు త‌ల్లైన త‌న అందం ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపించుకునేందుకు.. హద్దులు లేకుండా అందాలు ఆర‌బోస్తోంది. తాజాగా మ‌రోసారి అలాంటి ప‌నే చేసింది. మెరుపుల డ్రెస్ లో ధండ‌ర్ థైస్ ను చూపిస్తూ య‌మా హాట్ గా ఫోటోల‌కు పోజులిచ్చింది.

ఈ పిక్స్ చూసి సొంత ఫ్యాన్స్ లోనే కొంద‌రు ఆమెను ఛీ కొడుతున్నారు. ఆఫ‌ర్లు కోసం ఇంత‌లా స్కిన్ షో చేస్తూ దిగ‌జారిపోవాలా అంటూ మండిప‌డుతున్నారు. ఇక ప్ర‌ణీత అందాల‌ను ఇష్ట‌ప‌డేవారు మాత్రం.. ఆమె పిక్స్‌పై లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.