బాలయ్య కు కూడా తప్పని లీకుల బెడద.. భగవంత్ కేసర్ నుండి ఫొటోస్ వైరల్..!!

నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది .భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో బాలయ్య వయసు మలిన హీరోగా కనిపించబోతున్నారు. బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల నటిస్తున్నది. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఈ సినిమా పై మంచి ఎఫెక్ట్ చూపేలా కనిపిస్తోంది.

ఈ సినిమా యాక్షన్ సినిమాగా తెలంగాణ యాసతో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఫోటో లీక్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారుతోంది .ఈ ఫోటోలో కనిపిస్తోంది రీసెంట్గా జరుగుతున్న షూటింగ్ కి సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలను బాలయ్య అభిమానులు విపరీతంగా ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు. బాలయ్య మాస్ లుక్ లో బుల్లెట్ బండి పైన రైడ్ చేసుకొని వస్తూ ఉంటే నా స్వామి రంగా అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

ఈ చిత్రానికి సంగీతాన్ని తమన్ అందిస్తూ ఉన్నారు. ఈ సినిమా వీలైనంత త్వరగా పూర్తిచేసి డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తన తదుపరిచిత్రాన్ని మొదలు పెట్టాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నారు ఎన్నికలలోపు రెండు సినిమాలైన విడుదల చేసే విధంగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది బాలయ్య ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య బాబుకు సంబంధించి ఈ ఫోటో వైరల్ గా మారుతోంది.