సూపర్ స్టార్ కృష్ణ జీవితంలో మర్చిపోలేని డైరెక్టర్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎన్నో చిత్రాలను ఎంతో టెక్నీషియన్సీని సైతం తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత కృష్ణకి దక్కింది. ఏకంగా ఒకే ఏడాది 18 సినిమాలకు పైగా విడుదల చేసిన ఘనత కూడా కృష్ణకే దక్కింది.. అయితే ఒకానొక సమయంలో సూపర్ స్టార్ కృష్ణ పని అయిపోయిందని అందరూ భావించిన తరుణంలో ఒక్కసారిగా విడుదలైన నెంబర్ వన్ సినిమా మళ్లీ కృష్ణకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ చిత్రానికి ముఖ్య కారకుడు డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి..

ఎస్వీ కృష్ణారెడ్డి ..కృష్ణ కు వీరాభిమాని అంతేకాకుండా కృష్ణాలోని కొన్ని మైనస్ పాయింట్లను కవర్ చేస్తూ సరికొత్త ఇమేజ్ ని ఏర్పరిచే రీతిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.. కృష్ణ అభిమానులు ఎలా చూడాలనుకున్నారో అలా చూపిస్తూ నెంబర్ వన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా కాస్ట్యూమ్స్, లుక్స్ స్టైల్స్ యాక్టింగ్ ఇలా అన్నిటిలో కూడా యంగ్ హీరోగా చూపించడం జరిగింది.. ఒకసారిగా యంగ్ కృష్ణ ను తెరపైకి చూపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయట .అందుకే సూపర్ స్టార్ కృష్ణ కెరియర్ లో ఎస్ వి కృష్ణారెడ్డికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నదని తెలుస్తోంది.

నెంబర్ వన్ సినిమాకి ముందు కృష్ణ ఎన్నో ఫ్లాప్ లను చవిచూశారు… అలాంటి సమయంలో ఎస్వీ కృష్ణారెడ్డి గారు మాట ఇచ్చి ఈ సినిమా తీయడంతో మంచి విజయాన్ని అందుకున్నారు. కృష్ణ ఒక్క సీన్లో వాడిన డ్రెస్ మరొక సీనులో వాడలేదంటే ఈ సినిమాలు లుక్స్ కాస్ట్యూమ్స్ విషయంలో కృష్ణారెడ్డి గారు ఎంత శ్రద్ధ తీసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అయితే కృష్ణ గారికి నెంబర్ వన్ అనే టైటిల్ పెట్టినప్పుడు కృష్ణ అసలు నెంబర్ వన్ హీరోనే కాదంటూ విమర్శించారట కానీ ఈ సినిమా చూశాక విమర్శలు చేసిన వారంతా ముక్కున వేలు వేసుకున్నారట. ఇక ఇందులోని నటించిన నటుల సైతం ప్రతి ఒక్కరు సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయట. 1994లో సంక్రాంతిలో విడుదలైన ఈ సినిమా విజేతగా నిలిచింది.