కుక్కపిల్లతో బన్నీవాక్స్ ఫొటోషూట్.. నెటిజన్ల గుండెలను కొల్లగొడుతున్న క్యూట్ పిక్స్..

బన్నీ వాక్స్ అనే పేరుతో టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ బాగా ఫేమస్ అయింది వర్షిన్నె వర్మ. ఈ అందాల తార కేవలం టిక్ టాక్ లోనే కాకుండా యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. 2020 ‘విద్యార్థి’ అనే తెలుగు సినిమాలో మొదటిసారిగా నటించింది. ఆ తర్వాత ఇటీవల విడుదలైన రిచి గాడి పెళ్లి చిత్రంలో కనపడింది. ఈ అమ్మ చేసిన ‘ఓ పిల్ల సాంగ్’ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక ఇటీవల ఈమె చేసిన ‘వెన్నెల’ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్ లో ఉంది.

అయితే వర్షిన్నె వర్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఫాలోవర్స్ ని ఫిదా చేస్తున్నాయి. వర్షిన్నె తన కుక్కతో కలిసి క్యూట్ గా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఆమె క్యూట్ అందాలు చూసి అబ్బాయిలు కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు. తన పుప్పికి ముద్దు పెడుతున్న ఫోటోని చూస్తుంటే దానిపై ఆమెకి ఉన్న ప్రేమ అర్థం అవుతుంది. ఆ కుక్క కూడా వర్షిన్నె పై ఎంతో ప్రేమ చూపిస్తూ అచ్చం ఆమెలానే ఫోటోలకు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తన కుక్కతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వర్షిన్నె షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్ళు విపరీతంగా లైక్స్ కొడుతున్నారు.

బన్నీవాక్స్‌కి ఇన్‌స్టాగ్రామ్ 20 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ మధ్య ఉన్న ఇన్‌స్టాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. అభిమానులను అలరిస్తుంటుంది. అందానికి అందం, టాలెంట్ ఉండటంతో ఈ ముద్దుగుమ్మని చాలా మంది ఫాలో అవుతున్నారు.