అనుష్క శెట్టి పిచ్చిగా ప్రేమించిన స్టార్ క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా?

దాదాపు దశాబ్దన్నర కాలం పాటు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన అనుష్క శెట్టి.. ఈ మధ్యకాలంలో సినిమాలు చేయడం బాగా తగ్గించింది. వరస ఆఫర్లు వస్తున్నా సరే చాలా నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు యంగ్‌ హీరో నవీన్ పొలిశెట్టి కి జోడిగా `మిస్‌ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి` సినిమాలో నటిస్తోంది.

పి మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యోవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోంది. ఇదిలా ఉంటే.. అనుష్క నాలుగు పదులు వయసు వచ్చిన పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. ఈమె పెళ్ళికి సంబంధించి గతంలో ఎన్నో రకాల వార్తలు వచ్చినా.. అవి పుకార్లుగానే మిగిలిపోయాయి.

అయితే పెళ్లి సంగతేమోగానీ గతంలో అనుష్క శెట్టి ఓ స్టార్ క్రికెట్ ను పిచ్చిపిచ్చిగా ప్రేమించిందట. ఈ విషయాన్ని అనుష్క స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇంతకీ అనుష్క మనసు దోచుకున్న ఆ క్రికెటర్ మరెవరో కాదు రాహుల్‌ ద్రవిడ్‌. త‌న అభిమాన క్రికెటర్ రాహుల్‌ ద్రవిడ్ అని, చిన్నతనం నుంచి అతనంటే త‌న‌కు పిచ్చి అని, ఎంతలా అంటే ఒకానొక టైమ్ లో ద్రవిడ్‌తో పీకల్లోతు ప్రేమలో పడిపోయా` అని అనుష్క పేర్కొంది.