ఆ పార్ట్ ను చూపిస్తూ టెంప్టింగ్ పోజులు.. అనుప‌మ‌ను ఇంత హాట్ గా ఎప్పుడూ చూసుండ‌రు!

కేర‌ళ కుట్టి అనుప‌మ పరమేశ్వరన్ కెరీర్ ఆరంభం నుంచి స్కిన్ షో జోలికి పోలేదు. ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ చాలా ప‌ద్ధ‌తిగా క‌నిపించింది. కేవ‌లం ప‌క్కింటి అమ్మాయి త‌ర‌హా పాత్ర‌లనే ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకుంది.

కానీ, ఇప్పుడు ఈ అమ్మ‌డు రూటు మార్చి గ్లామర్ పుంత‌లు తొక్కుతోంది. హద్దులు దాటుతూ అందాలు ఆర‌బోతోంది. తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ టైట్ అవుట్ ఫిట్ లో నాజూకు న‌డుమును చూపిస్తూ టెంప్టింగ్ గా ఫోటోల‌కు పోజులిచ్చింది. మున్నెప్పుడూ క‌నిపించ‌నంత హాట్ గా ద‌ర్శ‌న‌మిచ్చింది.

అనుప‌మ తాజా ఫోటోలు నెటిజ‌న్ల‌కు షాకిస్తూ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి. అనుప‌మ లేటెస్ట్ పిక్స్ చూసి కుర్ర‌కారు చూపు తిప్పుకోలేక‌పోతున్నారు. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి జోరుగా ఉన్న అనుప‌మ ఇప్పుడు యంగ్ స్టార్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌కు జోడీగా `టిల్లు స్క్రేర్‌`లో న‌టిస్తోంది.

అలాగే మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా తెర‌కెక్కుతున్న `ఈగ‌ల్‌` మూవీలో ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. మ‌రోవైపు ట్రావెల్ బ్యాక్‌డ్రాప్ లో సాగే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి అనప‌మ క‌మిట్ అయింది.