మరో ఐటెం సాంగ్‌లో సెగలు పుట్టించడానికి సిద్ధమైన డింపుల్ హయతి..

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సినిమా భారతీయుడు 2. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ని కూడా పెట్టారు. ఈ స్పెషల్ ఐటెం సాంగ్ డింపుల్ హయతి చేస్తే బాగుంటుందని భారతీయుడు 2 మూవీ టీమ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. డింపుల్ హయతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు గల్ఫ్, ఖిలాడి లాంటి సినిమాలలో నటించింది. రీసెంట్ గా ఈ అమ్మడు నటించిన సినిమా ‘రామబాణం’.

 

హయతి సెగలు పుట్టిస్తూ చేయబోయే ఐటమ్ సాంగ్ భారతీయుడు 2లో ఎలా ఉంటుందో చూడాలి. ఈ ఐటమ్ సాంగ్ లో కమల్ హాసన్ కూడా ఫుల్ మాస్ స్టెప్పులు వేయబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ స్పెషల్ ఐటమ్ సాంగ్ లో లిరిక్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయట. ఇక ఇప్పటికే భారతీయుడు 2 షూటింగ్ చాలా వరకూ పూర్తి అయినట్లు తెలుస్తుంది. అలానే భారతీయుడు 2 లో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటించబోతుంది.

ఇక రకుల్ ప్రీతీ సింగ్ కూడా మరో కీలక పాత్రలో కనిపించబోతుందని సమాచారం. ఈ ఏడాది ఆగస్టు లోగా షూటింగ్ మొత్తం పూర్తి చేసేలా ప్లాన్ చేసారు మూవీ టీమ్. ఇక భారతీయుడు 2 సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరిలో అంచనాలు హై లెవెల్ లో ఉన్నాయి.