జేడీ చక్రవర్తికి మ్యారేజ్ ప్రపోజల్‌ చేసిన యాంకర్ విష్ణుప్రియ.. ఆ నటుడి రియాక్షన్ ఇదే..

ప్రముఖ టాలీవుడ్ నటుడు జేడి చక్రవర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జేడి చక్రవర్తి హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. శివ, గులాబీ, మనీ, సత్య లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించాడు. ఆ తరువాత సినిమాల నుండి కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు వెబ్ సిరీస్ ల తో బిజీ అయిపోయాడు. అంతేకాకుండా వరుస ఇంటర్వ్యూ లతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు.

జేడి చక్రవర్తి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇటీవల అతను నటించిన ఒక వెబ్ సిరీస్‌లో యాంకర్ విష్ణుప్రియ కూడా నటించింది. షూటింగ్ సమయంలో జేడి చక్రవర్తిపై మనసు పారేసుకుందట విష్ణు ప్రియ. రీసెంట్‌గా ఒక షోకి వెళ్లిన ఆమె జెడిపై ఉన్న ప్రేమని అందరి ముందు వ్యక్తపరిచింది. విష్ణు ప్రియ మాట్లాడుతూ ‘జేడీ చక్రవర్తి అంటే నాకు చాలా ఇష్టం, ఆయన ఒప్పుకుంటే నేను పెళ్లిచేసుకుంటా, వాళ్ళ అమ్మ గారిని కూడా ఒపిస్తా, ఆయన ఒప్పుకుంటే ఇప్పుడే తాళి కట్టించుకోడానికి నేను రెడీగా ఉన్నాను’ అంటూ చెప్పింది.

దాంతో విష్ణు ప్రియ జేడి చక్రవర్తి గురించి చేసిన ఈ ఇంటరెస్టింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జెడి చక్రవర్తి, విష్ణు ప్రియ వ్యాఖ్యలపై స్పందించాడు. జేడీ మాట్లాడుతూ ‘నేను, విష్ణుప్రియ కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించాం. ఆ సిరీస్ ని 40 రోజుల వరకు షూట్ చేసాం. ఆ సమయంలో ఇద్దరం క్లోజ్ అయ్యాం. కానీ మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే, ప్రేమ కాదు. అంతేకాకుండా ఆ వెబ్ సిరీస్ డైరెక్టర్ విష్ణు ప్రియ నాతో బాగా నటించాలని నేను నటించిన సినిమాలు అన్ని చూడమని చెప్పారు. ఆ విధంగా ఆమె నా క్యారెక్టర్ తో మాత్రమే లవ్‌లో పడింది. అంతే తప్ప మీరు అనుకున్నట్లు మా మధ్య ఏమీ లేదు ‘ అంటూ విష్ణుప్రియ ప్రేమ విషయంపై క్లారిటీ ఇచ్చేసాడు జేడీ చక్రవర్తి.