చీరలో సెక్సీగా మెరిసిన అనసూయ.. కొంటె కామెంట్లు చేస్తున్న నెటిజన్లు..

బుల్లితెర యాంకర్స్‌లో ఒకరైన అనసూయ వెండి తెరపై కూడా కొన్ని సినిమాలలో నటించి ప్రేక్షకులకు అలరించింది. న్యూస్ యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్‌గా మరింత ఫేమస్ అయింది. ఆ తరువాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలా ఎన్నో సినిమాలలో నటించిన ఈ అమ్మడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో ప్రేక్షకులకు పరిచయం అయింది.

అనసూయ నటించిన సినిమాలు క్షణం, రంగస్థలం, పుష్ప 1 లాంటివి ఎన్నో హిట్ అయ్యాయి. అనసూయ నటనకు ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. దాంతో ఈ అమ్మడుకి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. అందుకే బుల్లితెర పై షోలకు గుడ్‌బై చెప్పి వెండితెరపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం అనసూయ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అలానే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తన లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

అలానే గ్లామరస్ ఫొటోలను కూడా షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా ఒక పర్పుల్ కలర్ శారీని కట్టుకొని, బ్లాక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ధరించి అదిరిపోయే లుక్స్ తో ఫొటోకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ హాట్ ఫోజులు చూసి పెళ్లి అయ్యి, ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా అనసూయ అందం ఏ మాత్రం తగ్గలేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అనసూయ షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.