వ‌రుణ్‌తేజ్ – లావ‌ణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్‌లో ఇన్ని ట్విస్టులా…!

ఎప్పటినుంచో మెగా కుటుంబంలో పెళ్లి భాజలు మోగబోతున్నాయి అంటూ ఎన్నో వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ వార్తలకు త్వరలోనే ఫుల్ స్టాప్ పడబోతున్నట్లు తెలుస్తుంది. అసలు విషయం ఏమిటంటే త్వరలోనే మెగా కుటుంబంలోని నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ తాజాగా ఓ వార్త టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది. అయితే ఇప్పటికే వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఎన్నోసార్లు వార్తలు వచ్చినా వాటిలో ఎలాంటి నిజం లేదని తెలిసిపోయింది.

Varun Tej revealed his recent crush and more in an interesting Q&A | Telugu  Movie News - Times of India

అయితే రీసెంట్గా జరిగినన ఓ ఇంటర్వ్యూలో నాగబాబు త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి జరగబోతుందనీ ఇదే విషయాన్ని స్వయంగా వరుణ్ తేజ్ ప్రకటిస్తాడంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు దీంతో ఈ వార్తలపై మరింత బలం చేకూరింది. అయితే తాజాగా ఆ హీరోయిన్ తో వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆ హీరోయిన్ మరి ఎవరో కాదు యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మధ్య ఏదో నడుస్తుందని ఇప్పటికే ఎన్నో వార్తలు వస్తున్నాయి.

Varun Tej: పెళ్లి పీట‌లెక్క‌బోతున్న వ‌రుణ్ తేజ్‌.. ఆ స్టార్ హీరో కూతురుతో  ఏడ‌డుగులు!? - PakkaFilmy

ఇక ఎప్పుడూ ఈ వార్తలకు తగ్గట్టుగానే వరుణ్ తేజ్ ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్లో లావణ్య త్రిపాఠి కనిపించడంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో లావణ్య త్రిపాఠి మాత్రం అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది. కానీ ఎవరైనా సెలబ్రిటీలు మాత్రం వాళ్లు పెళ్లి పీటలు ఎక్కేదాకా వారు ప్రేమించిన వారి గురించి అసలు ఎప్పుడు బయటపడ్డారు.

Varun Tej and Lavanya Tripathi to tie the knot? Actress has THIS to say |  Masala News – India TV

లావణ్య త్రిపాఠి కూడా అలాగే చేస్తుందని తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ఏంటంటే ఈ ఇద్దరు వచ్చే నెల జూన్ లో నిశ్చితార్థం చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరలో పెళ్లి చేసుకునేందుకు కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులు అధికారింగా వెల్లడించాల్సి ఉంది.

Lavanya Tripathi Reacted on Wedding Rumours With Varun Tej - Sakshi

కాగా ఈ ఇద్దరు తారలు తమ రిలేషన్ షిప్ గురించి ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వనప్పటికీ, టాలీవుడ్ వర్గాలు మాత్రం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్టుగా చెబుతున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా ఇంట్లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి అంటూ మెగా అభిమానులు సంతోష పడుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది అనేది ముందు ముందు తెలుస్తుంది.

Share post:

Latest