ఐటెం సాంగ్ అంటే అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న తమన్నా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ తమన్నా గత కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గిపోతూనే ఉన్నాయి.. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ కూడా చేరవేగంగా జరుగుతోంది అయితే తాజాగా అందుతున్న అప్డేట్ ప్రకారం తమన్నా ఇప్పుడు మరొక సినిమాలో స్పెషల్ సాంగ్ నటించబోతున్నట్లు సమాచారం.

Aashvi Designs tamanna-bhatia-feuzhme WALL POSTER 13*19 inches Fine Quality  Matte Finish : Amazon.in: Home & Kitchen
నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా బాలయ్య కూతురు పాత్రలు శ్రీ లీల నటిస్తోంది. సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా ఈ మధ్యనే వైరల్ గా మారాయి. దీంతో ఈ సినిమా పైన క్యూరియాసిటీ ఒక్కసారిగా పెరిగిపోతుంది. బాలయ్యను ఢీకొట్టే పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తూ ఉన్నారు.

Tamannaah Bhatia completes 16 years in cinema - OrissaPOST
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలోని ఒక స్పెషల్ సాంగ్ లో తమన్నా నటించబోతున్నట్లు సమాచారం.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తమన్నా కోసం ఒక స్పెషల్ సాంగ్ ఎంపిక చేసినట్లుగా సమాచారం.. కేవలం ఈ ఒక్క పాట కోసమే తమన్న దాదాపుగా రూ.1.5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో చిత్ర బృందం ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది.. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ చిత్రం ఈ ఏడాది విడుదల కాబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా నుంచి అధికారికంగా చిత్ర బృందం స్పెషల్ సాంగ్ గురించి తెలియజేస్తుందేమో చూడాలి మరి.

Share post:

Latest