వెంక‌టేష్ సినిమాని దొబ్బేసిన ప్ర‌భాస్..ఆ అట్ట‌ర్ ఫ్లాప్ మూవీ ఏదో తెలిస్తే..మైండ్ బ్లాకే..!!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటాయి . టైం సరిపోక కావచ్చు ..రెమ్యూనరేషన్ ఇబ్బందులు కారణంగా కావచ్చు .. కారణం ఏదైనా సరే అలా ఒక హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేసి హిట్ కొడితే ఆ బాధ వర్ణాతితం .. ఫ్లాప్ కొడితే ఆ ఆనందం ఎంతలా ఉంటుందో అది చెప్తే కాదు ఆనందిస్తేనే ఉంటుంది . అయితే అలా మన తెలుగు హీరోలు ఒకరు చేయాల్సిన సినిమాలు ఒకరు చేసి సినీ ఇండస్ట్రీ వద్ద బోల్తా కొట్టారు . ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ ..రెబల్ స్టార్ గా పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ..

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వెంకటేష్ కెరియర్ లో ఎలాంటి హిట్ లు అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్యామిలీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు వెంకటేష్. అయితే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మంచి మంచి కథలను చూస్ చేసుకుంటూ వచ్చాడట . అంతేకాదు ఎప్పుడు ఫ్యామిలీ పరంగానే కాకుండా కొంచెం రొమాంటిక్ గా ట్రై చేద్దామంటూ లవ్ స్టోరీ అని కూడా విన్నారట. ఆలా విన్న కధే ఈ “రాధేశ్యామ్”..

డైరెక్టర్ రాధాకృష్ణ కొన్ని మార్పులు చేర్పులు చేసి “రాధేశ్యామ్” అనే టైటిల్ తో ఫైనల్ గా ప్రభాస్ తెరకెక్కించాడు. నిజానికి ఈ సినిమా కథ ప్రకారం ఒక ట్రైన్ జర్నీలో వెంకటేష్ – హీరోయిన్ చనిపోతారు ..ఆ తర్వాత మళ్లీ ఏం జనరేషన్లో వాళ్ళు పుట్టి ఆ ప్రేమకు మళ్ళీ పునర్జన్మ కలిగిస్తారు.. అలాంటి ఓ కాన్సెప్ట్ తో రాధాకృష్ణ ఈ స్టోరీని ఎప్పుడో రాసుకున్నారట .

అయితే కొన్నాళ్ల క్రితమే వెంకటేష్ కు చెప్పారట. ఆ కథ వెంకటేష్ కు నచ్చక రిజెక్ట్ చేసారట . ఫైనల్లీ ఆ కధ అటు తిరిగి ఇటు తిరిగి మార్పులు చేసి “రాధేశ్యామ్” సినిమా స్టోరీ గా మార్చి ప్రభాస్కు అంటగట్టారట. ఈ సినిమా ద్వారా ప్రభాస్ పరువు ఎంతలా పోయిందో ప్రత్యేకంగా చెప్పాలా ..? పొరపాటున వెంకటేష్ ఖాతాలో పడాల్సిన ఫ్లాప్ సినిమాను ఏరి కోరి ప్రభాస్ తన ఖాతాలో పడేసుకున్నాడు ప్రభాస్ అంటూ అప్పట్లో ట్రోలింగ్ కూడా జరిగింది . ఏది ఏమైనా సరే అలాంటి బాధలను తట్టుకుని ట్రోలింగ్లను ఎదుర్కొని ప్రభాస్ త్వరలోనే ఆదుపురుష్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. చూద్దాం ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడు..?

 

Share post:

Latest